దత్తపదులు:-సరళ గున్నాల-

విహారం స్వాగతం విజయం సంతోషం పదాలతో దత్తపది

ఉ*రాగల వర్షధారలనురాగపు సంతసమందుచుండగన్
స్వాగతమిచ్చెరైతులట శ్రాంతినిగోరక రేబవళ్ళు తా
వేగుగకాపలన్ ,విజయవీచికనందుచుండగా
సాగు విహారమంచు మనసారగ జేయును సేధ్యమెప్పుడున్

గోడ నీడ మేడ  జాడ పదాలతో

గోడలు స్వర్ణమయములై
మేడలునిర్మించినిలుచు,మేలునుగూర్పన్
నీడగ వింతగుకప్పులు
జాడౌదురు ధనముకెల్ల జయములనందన్
కామెంట్‌లు