1.తెగని ఆలోచనలు!
మెదడు నిండా!
ఆరని ఆవేదనలు!
హృదయం మోయలేకుండ!
2.ఆడలేని ఆట!
పాడలేని పాట!
సాగలేని బాట!
అదే ఊగిసలాట!
3.అంతరంగం!
బహిరంగం!
అర్థంకాని చదరంగం!
బతుకు మోగేమృదంగం!
4.కర్మ నూలుగింజ!
ఫలం మిరపగింజ!
ఆశ కదలని గుంజ!
తప్పని గుంజీలాట!
5.భావాలు భావుకత!
నిజాలు వాస్తవికత!
అవి పరమప్రియం!
ఇవి జరగడం ఖాయం!
ఊగిసలాట ఎంతో నయం!
6.ముందుకు పోయే కాలం!
బతుకు ఊగే లోలకం!
ఎప్పుడూ డోలాయమానం!
అనుక్షణం ఊగిసలాడడం!
తన్నితాను ఓదార్చుకోవడం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి