రాణి రాసమణిదేవి. అచ్యుతుని రాజ్యశ్రీ

 కొంత మంది వ్యక్తులు ఎన్నో గొప్ప పనులు చేస్తారు కానీ వారి ని గూర్చి  ప్రపంచంకి అంతగా తెలీదు. భారతీయుల గూర్చి మనకే తెలీదు.ప్రతి రాష్ట్రంలో చరిత్రప్రసిద్ధి కెక్కిన  వారున్నా మనకి అపరిచితులు గా మిగిలారు. నేటి కలకత్తా వైభోగంకి కారణం రాణి రాసమణిదేవి  అని మనలో ఎందరికి తెలుసు? ఆమెను గూర్చి తెలుసు కుందాము.
 హౌరా దగ్గర బ్రిడ్జికట్టించింది.  కలకత్తా నగరంగా మారటానికి దోహదం చేసినది.దుర్గా మాత ఊరేగింపుని ఎవరూ అడ్డుకోరాదని శాసించింది. నదులపై పన్నులు వసూలు చేసే బ్రిటిష్ వారిని  అడ్డుకుంది. 
కలకత్తా లో దక్షిణేశ్వరంలో ఆలయనిర్మాణం గావించింది. సామాన్య ప్రజల రాకపోకల కోసం కలకత్తా లో పడవల సౌకర్యం  స్నానఘట్టాలు కట్టించింది. బాబుఘాట్  నీమ్ తలఘాట్  లు నేటికీ  ఆరోజు లను గుర్తుచేస్తాయి.శృంగేరిశంకరాచార్య ఆలయపునరుద్ధరణ  కృష్ణ జన్మభూమి మధుర లో గృహనిర్మాణం గావించింది. ఢాకా ముస్లిం నవాబు నించి రెండు వేలమంది హిందువుల కి వారిస్వేచ్ఛ  స్వాతంత్ర్యం కోసం  డబ్బు చెల్లించింది. రామేశ్వరం నుంచి  శ్రీ లంక దాకా తీర్ధయాత్రికుల కోసం బోటు సర్వీసు ప్రారంభించినది.ప్రస్తుతం కలకత్తా క్రికెట్ స్టేడియం  ఉన్న  భూమి ని  దానంచేసినది. సువర్ణరేఖ నదినుంచి పూరీదాకా  రోడ్డు మార్గం వేయించినది.కలకత్తా నేషనల్ లైబ్రరీ ప్రెసిడెన్సీకాలేజీకి పెద్ద మొత్తంలో  విరాళాలు ఇచ్చింది. ఇన్ని పనులు చేసిన ఆమె ఆధ్యాత్మిక రంగంలో మనకు అందించిన కానుక  రామకృష్ణ పరమహంస. తను కట్టించిన  దక్షిణేశ్వరంలోని కాళీమాత ఆలయంలో ఆయనకు పూజారి పదవి కట్ట బెట్టినది.స్వామి వివేకానంద  ఆయన శిష్యుడిగా భారత దేశ భాగ్యవిధాతగా  మనకు నేటికీ  మార్గదర్శి గా నిలిచాడంటే  మూల కారణం ఆచల్లనితల్లి రాణి రాస్మోణీ.1793నుంచి 1863దాకా ఆమె చేసినన్ని ఉత్తమకార్యాలు  న భూతో న భవిష్యతి.ఆమె చరిత్ర కేవలం  రామకృష్ణ పరమహంస జీవితం లో మాత్రమే కనపడటం శోచనీయం.పాఠ్యాంశాలు గా మోరల్ సైన్స్ లో ఇలా మరుగునపడిన మాణిక్యాలను   వెలికితీసి బాలలకు బోధించాలి.పశ్చిమ బెంగాల్ కే పరిమితం కాకుండా  యావత్తు భారత దేశంలో ఇలాంటి మహనీయుల చరిత్ర  బాగా ప్రచారం లోకి తేవాలి.రాష్ట్రాల వరకే మహనీయుల  జీవితం  పరిమితం కారాదు.
కామెంట్‌లు