వృద్ధాప్యం...అచ్యుతుని రాజ్యశ్రీ

 మన చిన్నతనం యవ్వనం అంతా ఆనందం కష్టసుఖాల కలబోతగా బాగా  గడుస్తుంది. కానీ  ఇప్పుడు  జవసత్వాలు ఉడిగి ఇంట్లో వారి విసుగు చిరాకు పరాకులు భరించే అమ్మమ్మ బామ్మ తాతల గూర్చి ప్రతి వారు ఆలోచించాలి. బాల్యం నించి  అమ్మా నాన్న లు తమ తాత బామ్మ అమ్మమ్మ ల పట్ల శ్రద్ధ ప్రేమ చూపితే నేటి పిల్లలు చూసి అనుసరిస్తారు.లేకుంటే  తాత మూకుడు దాచి తండ్రికి వాడే తరం తయారు అవుతుంది. "ఆకాశం కేసి చూడసాగాడు గోపయ్య.నల్ల మబ్బులు  విరబోసుకున్న జుట్టు లా ఆకాశాన్ని ఆవరించాయి. అతని కళ్ల లో గిర్రుననీరు! పంటకోసి కుప్పలు వేశాడు.ముందే గోడౌన్ కి పంపాలంటే కరోనా  వచ్చింది. బిడ్డ పురిటికి వచ్చినది.ఆసుపత్రి లో కోవిడ్ రోగులు!"ఏందయ్యా!ఎంత సేపు ఆలోచిస్తావు? భూమి ని నమ్ముకున్నవాడి గతి ఇంతే!క్రితం సారి నకిలీ పత్తివిత్తులిచ్చి ఆషాపువాడు మోసం చేశాడు. మనం పెట్టిన కేసు మనకే ఎదురు తిరిగింది.పేదవాడి కోపం పెదవికి చేటు అంటే విన్నావా?" భార్య సాధింపుతో గొణుగసాగాడు."అవును కలికాలం. బంగారం లాంటి రెండు ఎకరాలు అమ్మి కొడుకు ని అమెరికా పంపాము."నాన్నా! పనివత్తిడి  ఇక్కడ ఎక్కువ. హైదరాబాదు లో విల్లాకొన్నాను.అక్కడ ఉండి మిగతాది అద్దెకు ఇచ్చి  బతకండి.లోన్ తీరాలి. "అని 10ఏళ్లు దాటినా  పైసా పంపలేదు. వాడి భార్య కూడా నౌకరీ చేస్తోంది. ఇల్లు పొలం అమ్మి హైదరాబాద్  వెళ్లి తే  మనబతుకు కుక్క కన్నా  హీనం.
ఆడపిల్ల పెళ్లి  టెన్త్ కాగానే చేశాను. న్యూస్ పేపర్ లో పనిచేసే అల్లుడు ఉద్యోగం పోయింది. అతనూ మన దగ్గరే తిష్ఠ వేశాడు.ఆకుకూరలు  పూలమొక్కలు నాటాడు.చిన్న కల్లు దుకాణం తెరుద్దాం మామా  అని  అంటాడు.కూలీ నాలీ వారు  కల్లు మత్తు లో పడితే  ఆలుబిడ్డల గోస తగుల్తది అన్నా.అంతే ఇల్లు  పొలం అమ్మి  ఆడబ్బు తో పట్ట ణంలో వైన్ షాపు తెరుస్తాడు ట."  అక్కడే ఉన్న కూతురు అంది"ఇలా ఆలోచిస్తే  నా భవిష్యత్తు ఏంటీ  ?నాకు  జల్దీ లగ్గం చేసి  నా గొంతు  కోశావు కదా?"  ఆముసలి దంపతులు  నోరు తెరిచి అలా ఉండిపోయారు. ఇద్దరు  తమ తల్లిదండ్రులు  అత్తమామల ను ఆదరించ లేదు. దాని ఫలం ఇప్పుడు  అనుభవిస్తున్నారు.
కామెంట్‌లు