"ఆమ్మా!ఇవాళ ఏమి వండుతున్నావు?"జయ ప్రశ్న కి "ఆలోచిస్తున్నాను "అమ్మ జవాబు. "కూరలు ఏమీ లేవు".నేనువెళ్లితెస్తా"రాధ సంచీ తీసుకుంది. "నీవు అన్నీ చచ్చుపుచ్చులు తెస్తావు. నీకేం తెలియదు. ఆసంచీ దేనికి?అక్కడ ప్లాస్టిక్ కవరు ఇస్తారు. "చిరాకు గా అంది జయ. "ప్రతిదానికీ నాకు అడ్డం పడతావు.నాకన్నా నీవు ఒక ఏడాది పెద్ద.కానీ పెత్తనం చెలాయించి నా నోరు నొక్కుతావు".రాధ ఉక్రోషంగా అంది."అబ్బబ్బ!గిల్లి కజ్జాలు పెట్టుకోకండి.ఇద్దరు ఉప్పు నిప్పు. నీవు కూడా తీసుకుని రా"రాధ చేతికి డబ్బు ఇచ్చింది అమ్మ. "రాధ కి బేరం చేయటం రాదు. నేను మంచి సరుకు తెస్తా " హడావుడిగా వెళ్ళిపోయింది. "రాధ బుంగమూతి పెట్టి అంది"అన్నిటికీ జయదే పెత్తనం. నేను చిన్నదాన్ని అని నాకు ఏ బజారు పని చెప్పవు.నాకు నచ్చిన కూర తెస్తా"అని సంచీతో అమ్మ సరే అనటంతో ఉషారుగా బైట పడింది రాధ. కూరల అంగడి సందడి సందడిగా ఉంది. రకరకాల కళ్ళు చెదిరేలా ఉన్నాయి. "రండి రండీ!తాజా దోసకాయలు. కిలో పది రూపాయలు!"ఉషారుగా చలాకీ గా అరుస్తున్నాడు.బంగారు రంగులో నవ నవ లాడుతూ కనువిందు చేస్తున్నాయి. "అమ్మా!పదిరూపాయల కి రెండు తోటకూర కట్టలు" ఓముసలవ్వ బక్కగా దీనంగా బతిమలాడినా ఒక్కరూ ఆమె వైపు కన్నెత్తి చూడటంలేదు.వెండిబుట్టలా తల లోతుకు పోయిన కళ్లున్న అవ్వ నిరాశగా చూస్తోంది.
ఎదురుగా రాధ కనపడగానే"నీవు ఎందుకు వచ్చావు"మొహం చిట్లించిన జయతో "అమ్మ నాకు నచ్చిన కూరలు తెమ్మంది"గర్వంగా ముందుకు సాగిన రాధను దోసకాయల అబ్బాయి అరుపు ఆకర్షించింది. కానీ ఎదురుగా దీనంగా "బంగారు తల్లీ!పదిరూపాయల కి రెండు తోటకూర కట్టలు.తీసుకో"అవ్వ బతిమాలడంతో ఇంకేమీ ఆలోచించకుండా పది రూపాయలు ఇచ్చింది. "ఈచిన్న కట్ట తీసికో బిడ్డా!" వద్దు అన్నా వినకుండా సంచీలో వేసిన ఆమెకి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది రాధ. అమ్మ తిడుతుంది ఏమో వాడిపోయిన తోటకూర తెచ్చాను అని ఆమెకి మనసులో పీచు పీచు అంటున్నది."అమ్మా!నాకు దోసకాయ పప్పు తినాలని ఉంది. చెయ్యి. " జయ అరిచింది. అలాగే అని అమ్మ శుభ్రంగా కడిగి చెక్కుతీసి ముక్క గింజ నోటి లో వేసుకుని బాబోయ్ చేదు అని బైటకి వెళ్ళి ఉమ్మేసింది."జయా!ఇలా రా! "అని దోసకాయ తరిగి గింజలు ముక్కలు చేదు చూడమంది.కిలో కాయలు చేదువిషం!జయకి తోటకూర అవ్వ మొహం నవ్వు తూ పరిహసిస్తున్నట్లు కనపడ సాగింది. రాధ తెచ్చిన తోటకూర కడిగి తరిగి పప్పు చేసిన అమ్మ వంక దీనంగా చూసింది.జయ మనసులో ఏదో బాధ పశ్చాత్తాపం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి