చిన్నారి బాలలు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

మా చిన్నారి బాలలు
విర పూసిన పువ్వులు
కిల కిల నువ్వులతో
నీటిలోని కల్వలు

బిరబిర పరుగులతో
ఎగిరి దూకే జింకలు
ఆట పాటలలో వారు
ఆకాశాన ఎగిరే పక్షులు

పనులు చేయుటలో వారు
అలుపెరుగని వీరులు 
విద్యా బుద్ధులు నేర్చుటలో
సరస్వతి బిడ్డలు వారంతా

అమ్మ నాన్నలకు ఎప్పుడు
చేదోడు వాదోడుగ ఉండే
చురుకైన బుడతలు వారు
మా పల్లెటూరి పిల్లలు 

కామెంట్‌లు