ఆరిందా !(కైతికాలు ):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

పప్పు రుబ్బి వడలొండుత
పిండి విసిరి రొట్టె చేస్త
ఆడ పిల్ల నండి నేను 
అవలీలగ పనులు చేస్త
వారెవ్వా చిన్నిపాప 
చెప్పాలంటే ఎంతో కత!

అల్లరి మాన్పగ పనులను 
మెల్లగ నేర్పిన మేలగు 
చల్లని నవ్వులు విసురుతు 
పాపకానందం కలుగు 
వారెవ్వా పాపాయిలు 
ఇంటికి వెలుగుల సిరులు!

లంబాడీ దుస్తులు భలె 
అందంగా అమరినాయి 
అద్దాల అంచుల లోన
తళుకు మెరుపులు రాలాయి 
వారెవ్వా చిన్నారి 
విసురుతోంది తిరగలి పిడి!

-