*మోటు మొగడు* *(జానపదగేయం)*:-సామలేటి లింగమూర్తి-సర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్త సిద్దిపేట
అత్తా మేనత్త
యెట్ల గన్నవే
మోటోడు నీ కొడుకు
మొగడు యాయెనే
నేనేమి చేతునే    "అత్తా"

కౌసు వుంటెనే మొగడు
కాస్త తింటడే
లేకపోతే కంచము
విసిరి వేస్తడే        "అత్తా"

కల్లు త్రాగి వచ్చిరాత్రి
లొల్లి చేస్తడే
పొల్లు పొల్లు కొట్టి నన్ను
లేవ నీయడే

         "అత్తా"

ఉండలేను వండలేను
వెళ్ళి పోదునే
తల్లిగారి యింటికాడ
హాయి గుందునే    "అత్తా"