మత్తేభము:
*తమకంబొప్ప, పరాంగనాజన పర | ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం*
*గ మహోద్యోగముసేయు నెమ్మనము, దొం | గంబట్టి వైరాగ్య పా*
*శములంజుట్టి బిగించి నీదు చరణ | స్తంభంమునంగట్టి వై*
*చి ముదంబెప్పుడు గల్గజేయగదవో | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మా మానవుల మనసు ఎప్పుడూ ఎదుటి వారి స్త్రీలను, ఎదుటి వారి డబ్బును కొల్లగొట్టాలనే చూస్తూ వుంటుంది. అలా దొంగిలించిన డబ్బు తో ఆనంద పడాలి అనుకుంటుంది. ఇలాంటి దొంగ బుద్ధి కల మా మనసును నీ పాదలను పట్టుకుని స్థిరముగా, నిలకడగా వుండేటట్లు చేయి, చిదంబరేశ్వరా........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిన్ను తలచుకుంటూ, నీ పాదాల దగ్గరగా వుంటూ, ఆనందించమని నీవు మాకు ఇచ్చిన మా మనసు అనే చోరుడు సహజ సిద్దంగా తన లక్షణాన్ని వదలుకోక, పర దారా ధన విత్తములందే ఆసక్తి కలిగి వుంటోది. చిలిపి దొంగతనాలు చేసి, వాటివల్ల వచ్చే క్షణికమైన ఆనందాన్ని కోరుకునే బాల్యావస్థ నుండి ఈ వలకు రానంటోంది. ఇటువంటి మా మనసునూ, మమ్మల్ని చేరదీసి, అమ్మ లాగా లాలించి, మా ఉన్నతి కోరుకునే తండ్రి లాగా మందలించి, మాలో వున్న ఈ మనసు అనే దొంగని నీ స్ఫురణలో గడిపేటట్టుగా దారి మళ్ళించి, నీ నామ జపం చేస్తూ, నీ పాదాక్రాంతమై, నిన్ను చేరుకునేటట్టు, ఎప్పటికి చేస్తావు స్వామీ, కాశీ విశ్వేశ్వర! నీవే నన్ను ఉద్ధరిచ గలవాడవు. దయతో కాపాడు తండ్రీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి