*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౬ - 86)

 శార్దూలము:
*సంపద్గర్వము బారద్రోలి, రిపులన్ | జంకించి, యాకాంక్షలన్*
*దప్పన్వెట్టి కళంకముల్నరికి బంధ | క్లేశ దోషంబులన్*
*చింపుల్జేసీ, వయోవిలాసములు సం | క్షేపించి, భూతంబులన్* *చెంపల్వేయక నిన్ను గాననగునా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మాకు కలిగున డబ్బు వలన వచ్చే గర్వము పోగొట్టుకుని, కామము, కోపము మొదలగు శత్రువులను వదిలించుకుని, ఆశలనుండి తప్పించుకొని, దోషములను అన్నింటి నరికి, బాధను కలుగించే చెడ్డపనులను చీల్చి పిప్పి చేసి, వయసు పెట్టే అల్లరిని పక్కకి తప్పించి, తప్పు పనులు చేసే పంచ ప్రాణాలకు చెంపలు వేయకుండా, నిన్ను చూడడం సాధ్యం అవుతుందా, శివా! ........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మాకు నువ్విచ్చిన అరిషడ్వర్గాలను జయించి, వయసు చేస్తున్న కామ విన్యాసాలను తప్పించుకుని, మాకున్న కోరికలను తెగ నరికి, బంధాలను, అనుబంధాలను విడనాడి, మా నసు యొక్క చంచలత్వాన్ని తెగనాడి నిన్ను మనసా, వాచా, కర్మణా నమ్మితే గానీ నీదర్శన భాగ్యం లభించదుగదా, చిదంబరేశ్వరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు