ఆరోగ్యానికి ఆపిల్:- కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  'అన్ అపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే'అని ఆంగ్ల సూక్తి. ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఆపిల్ పండ్లు రోజా చెట్ల జాతికి చెందినవి.ఈ చెట్లు సుమారు 12 మీ. ఎత్తు పెరుగు తాయి.పండ్లలో ఎనభై శాతం నీరు ఉంటుంది.ఆపిల్ పండ్ల చెట్లలో చాలా రకాలు ఉన్నాయి.చల్లని ప్రదేశాల్లో ఇవి ఎక్కువ పెరుగుతాయి.మన దేశంలో కాశ్మీరీ ఆపిల్స్ కి ఎంతో పేరుంది.అమెరికా,స్విట్జర్లాండ్ వంటి చల్లని దేశాల్లో చెట్లు విరివిగా పెరుగుతాయి.
       ఆపిల్లో ఉండే పెక్టిన్ అనే పదార్థం శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గించి,రక్త నాళాలు మూసుక పోకుండా గుండెను కాపాడుతుంది.ఉదయాన్నే పనికి పోయేముందు ఆపిల్ పండుతింటే ఊపిరి తిత్తులు తగిన శక్తి పొందడం వలన అలసట లేకుండా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఆపిల్ తింటే శరీర జీవక్రియలు సజావుగా జరిగి ఆరోగ్యం బాగుంటుంది,అదిగాక శరీర నాడీ వ్వవస్థను ఆపిల్ కాపాడుతుంది.దీనివలన వృధాప్యంలో ఆల్జిమర్స్ (మతిమరపు) రాకుండా కాపాడుతుంది.ఆపిల్  శరీరంలో ఇన్సులిన్ సమతుల్యతను కాపాడుతుంది. అందువలన ఈ పండు మధుమేహ రోగులకు మంచిది.క్రమంతప్పకుండా ఆపిల్స్ తింటే పాంక్రియాటిక్ కాన్సర్ రాకుండా కాపాడుతుంది.ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.విరోచనాలను అరికట్టడంలో కూడా ఉపయోగ పడుతుంది.
       ఆపిల్లో క్యుర్సెటిన్ అనే పదార్థం రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది.
      ఆపిల్ ను కొరికి నమలడం వలన నోటిలో లాలా జలం బాగా ఊరి నోటిలో హాని చేసే బాక్టీరియాను చంపి పళ్ళు పుచ్చి పోకుండా కాపాడుతుంది.
   ఆపిల్ రసానికి ఈస్ట్ పదార్థం కలిపి వెనిగర్ అనే వంటల్లో వాడే పదార్థం తయారు చేస్తారు.
   రోజుకో ఆపిల్ తినండి హాయిగా ఉండండి.
                  """""""""""""""
వియత్నాం,కాంబోడియా,లావోస్ లను కలిపి ఇండోచైనా అంటారు.
             ***********************
  
కామెంట్‌లు