విచిత్రమేమిటంటే 'టమోటా'అనేది పాశ్చాత్య పదం,దీనికి తెలుగులో మన ఇతర భాషల్లో పదం లేదు.దీని జన్మ స్థానం దక్షిణ అమెరికా.
16వ శతాబ్దంలో దీనిని పోర్చుగీసువారు మనదేశానికి తీసుక వచ్చారు.
కానీ 1822లో ఈస్ట్ ఇండియా కంపెనీ(బ్రిటిష్) వర్తకులు మనకు టమోటాలు పండించడం నేర్పారు.అందుకే దీని ప్రస్తావన మన పాత సాహిత్యంలో కనబడదు.
ఇప్పుడు మనదేశంలో సుమారు ఏడు మిలియను టన్నుల టమోటాలను పండిస్తున్నారు!
మన రాష్టరంలో రాయల సీమలో విపరీతంగా పండిస్తున్నారు.ఉత్తర ప్రదేశ్ ,మహారాష్ట్ర, కర్నాటక,
పంజాబ్,హర్యానాలలో కూడా బాగా పండిస్తున్నారు.
దీని శాస్త్రీయనామం 'సోలోనమ్ లైకోపెర్సికమ్'
ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.వీటిలో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఫోలేట్,పొటాసియమ్,విటమిన్ కె ఉన్నాయి.మరీ ముఖ్యంగా 'లైకోపిన్' అనే ఆంటీఆక్సిడెంట్ ఉంటుంది.ఇది ఆరోగ్యానికి మంచిది.ముఖ్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా కాపాడుతుంది.
అనేక పరిశోధనల ఫలితంగా ఎక్కువకాలం నిలవ ఉండే టమోటాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి.వారణాసిలో గల 'వెజిటబుల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్' కూడా వైరస్,ఫంగస్ వంటి జీవుల బారీన పడని టమోటాల అభివృద్ధిఖి విశేష కృషి చేస్తోంది.
అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం టమోటా ఏరూపంలో(సాస్,కెచప్,పచ్చడి) తిన్నా
ఆరోగ్య ఫలితాలు ఒకటిగానే ఉంటాయని తేలింది.
ఇది గుండెఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
స్పెయిన్ దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టులో టమోటాలతో కొట్టుకునే'లాటమోనిటా' అనే పండుగ జరుపుకుంటారు.
టమోటా చెట్లు మామూలు నేలలు అంటే క్షార,ఆమ్ల గుణాలు లేని నేలల్లో శీతాకాలంలో ఎక్కువ సాగు చేస్తారు.చెట్లకు మధ్య సుమారు అర్థ మీటరు దూరం ఉండాలి.ఎనిమిది లేక పదిగంటలు సూర్యరశ్మి చెట్లమీద పడేట్టు చూసుకోవాలి.సూర్యోదయం నుండి పొద్దున 9గం॥ లోపు చెట్లకు నీళ్ళు పోయాలి.ఎక్కువ ఎరువులు వేయకూడదు.టమోటా చెట్లమధ్య మేరీగోల్డ్ వంటి చెట్లను పెంచవచ్చు.వీటి పూల నుండి వచ్చే సువాసనలు పురుగులను తరిమి వేస్తాయి!
టమోటాలలో అనేక రకాలు ఉన్నాయి మనరాష్ట్రంలో 'పూసారూబీ' అనే రకం అనువైనది అని చెబుతున్నారు.
ఇది సులభంగా జీర్ణమవుతుంది.రోగగ్రస్తులకు కూడా మంచిది.
ఆహారానికి ఇది రంగు,రుచి ఇస్తుంది.
ఇన్ని మంచి గుణాలున్న టమోటాను రోజూ తినడంలో తప్పులేదు.
కానీ దీనిలో తక్కువ మోతాదులో ''ఆక్సలేట్స్'అనే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పరచే రసాయనం ఉంటుంది.అందుకే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడిన వారిని వైద్యులు తినవద్దనంటారు.
ఎర్రని టమోటా:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి