మట్టి ప్రేమ:-కంచనపల్లి వేంకట కృష్ణా రావు--9348611445

       మట్టంటే ఒక అమ్మే!
       విత్తనాన్ని ఒడిన చేర్చుకుని
       ఆనందంగా మట్టి దుప్పటి కప్పుతుంది!
      నీటిని ఒడిసి పట్టి
       బుజ్జివిత్తనాన్ని ఆనందంగా పెంచుకుంటుంది!
     మొలకగా ఎదిగిన విత్తనాన్ని చూసి.  
     పులకించి పోతుంది.
    మొలక చెట్టయి బోలెడు ప్రాణవాయువు,
    పండ్లు పంచుతున్నప్పుడు
     అమ్మ మట్టి తన జీవితం తరించిందని
     ఆనందం ఒలక బోస్తుంది!
     ఎంత చిత్రం మట్టి మటుకు
     గర్వంతో పొంగక
    ఎదిగి సేవ చేస్తున్న చెట్టుకు
    సేవ చేస్తూనే ఉంటుంది!

కామెంట్‌లు