తాతయ్య కథలు-95..ఎన్నవెళ్లి రాజమౌళి

 తాతయ్య. మా క్లాస్ టీచర్ జెండా గురించి వాయిస్ రికార్డు పెట్టమన్నారు. కొంచెం వివరాలు చెప్పవా.
ఈ నెలలోనే స్వాతంత్ర దినోత్సవం కదూ. అందుకే జెండా గురించి వివరించ మన్నాడు. అవును తాతయ్య. జెండాకు ఎన్ని రంగులు ఉన్నాయి?
మూడు రంగుల జెండా/ముచ్చటైన జెండా అని ఒకటో తరగతి నుండి పాడుకుంటున్న. అది తెలవదా. మూడు రంగులు.
జెండాకు పై రంగు కాషాయ రంగు. మద్యన రంగు తెలుపు. కిందికి ఆకుపచ్చ. అవునా?
అవును. అయితే కాషాయ రంగు ఏమో పౌరుషానికి గుర్తు. తెలుపు రంగు ఏమో శాంతికి గుర్తు. ఆకుపచ్చ రంగు ఏమో పచ్చని పంటలకు గుర్తు.
ఈ మధ్యన ఉన్న చక్రం ఎక్కడనుండి తీసుకున్నారు తాతయ్య. అశోక చక్రవర్తి సారనాథ్ స్థూపం నుండి తీసుకున్నారు. ఈ జెండాను మన తెలుగు వాడు పింగళి వెంకయ్య చేసినదే.
మంచిది తాతయ్య వివరాలు అందించినందుకు కృతజ్ఞతలు అన్నారు మనవడు.
కామెంట్‌లు