మేము మట్టి మనుషులము:---గాజులనరసింహ--977071129

మట్టిలోనె  పుట్టినాము
మట్టిలోనె.  పెరిగినాము
మట్టిలోనె   ఆడినాము 
మట్టినే   తిన్నాము
మట్టి మనుషులం మేము
చివరకు మట్టాయి పోతాము   


సెలిమి నీళ్లు తాగినాము
చెట్టు పుట్ట తిరిగినాము
వాగు వంక ఈదినాము
బండపై పండినాము
మట్టి మనుషులం మేము
చివరకు మట్టాయి పోతాము. 


ముళ్ల బాట నడిచినాము 
ముళ్ల కంచె దాటినాము 
పల్లేరులు తొక్కినాము
పస్తులెన్నొ  ఉండినాము
మట్టి మనుషులం మేము
చివరికి మట్టాయి పోతాము. 


కష్టాలెన్నో పడ్డాము
వేదనెంతో చెందాము
కన్నీళ్లు కార్చామూ
బతుకు దారిలో మేము
భగవంతుడా ఏమిరా..ఇది అన్నాము
బదులు లేక వూకున్నాము  


జంతువులతొ  సావాసము 
కాలంతో  సాహాసము
మాది బతుకు పోరాటము
దిన దిన గ0డ పయనము
మట్టి మనుషులం మేము
చివరకు మట్టాయి పోతాము. 


ఆవు గేదలు   కాస్తాము
ఆకులలుము తింటాము
సద్దన్నం తింటాము
వినయంగా ఉంటాము
ప్రకృతి నేస్తాలము మేము
మాయిల్లు  పర్వత ప్రాంతము 


మాలో లేదు కల్మషము 
కలిమికి మురిసిపోము
కలతకి జడిసిపోము
కలిసి కూడ ఉండేము
చెలిమి తోడ బతికేము
మాఊరు ఉన్నతము  

ఎండల  ఎండిపోతాము
వానల  తడిసి పోతాము
చలికి వణికి పోతాము
మూడు కాలాలకు మేము
ముడిపడి పోతాము
ముచ్చటగా ముందుకు సాగిపోతాము. 

కస్ట0లోనే  మాకు
ఉందిలే ఆనందము
బురద మరకలే మాకు
ఉన్నత అలంకారము
శ్రమపడితేనే మాకు ఆరోగ్యం
మట్టి మనుషులం మేము  

కొంటె రాగ కోయిలలము
అరె పల్లె జానపదులము
ఆ దేవుడు ఆడించు 
మేమాట బొమ్మలము
ముద్దు ముద్దుగా వుండే బుట్ట బొమ్మలము
మేము మట్టి మనుషులము. 


కామెంట్‌లు