జీవన రాగం .. !!--> డా . కె ఎల్ వి ప్రసాద్ హన్మకొండ (9866252002)--prasadkanety@gmail.com

రాజకీయము లెంత  లాభసాటిగ మారే 
ప్రజాసేవ పేరుతో దోపిడీ మొదలయ్యే .. 
చదువుతో పనిలేని చౌక  వ్యాపారమిది 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము !!

నాయకుడి పేరుతొ కొత్త వేషము వేసి 
నలుగురి నోళ్ళలో నానుదురు గొప్పగా 
తిరకాసు రాజకీయమే తిండి సంపాదించు 
వినుము కె ఎల్వీ మాట నిజము సుమ్ము !!

ప్రజల సమస్యలు తీర్చ తీరికే ఉండదు … 
స్వంత లాభము కొరకు వింత చేష్టలు చూడు 
నాయకుడంటేనే స్వార్ధమునకు చిరునామా .. 
వినుము కె ఎల్వీ మాట నిజము సుమ్ము !!

స్వంత ప్రయోజనమునకు ఎన్నికలలో 
కులము -మతము ఉపయోగింతురు.. 
పదవి అందగానే మన దరికి రాబోరు 
వినుము కె ఎల్వీ మాట నిజము సుమ్ము !!

కులము ఓట్లతో పలు  పదవులను పొంది  
కుల రక్షణలో వీరు కుంటి సాకులు వల్లింప 
సిగ్గులేనితనము వీరికే చెల్లును సుమా .. 
వినుము కెఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

రంగు రంగుల కండువాలు రాజకీయ గుర్తులు 
ఎన్నివున్న నేమి ప్రజల మనిషి కానివాడు 
అధికారము వైపుకే కండువాల వలస సుమా 
వినుము కె ఎల్వీ మాట నిజము సుమ్ము .. !!  

                        *** 
కామెంట్‌లు