క్రీడావీరుడు ...!! >కవిత --డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ > 9866252002*
 వందేళ్ల ఒలింపిక్ చరిత్రను 
తిరగరాసి న ఘనుఁడు 
భారతీయుడు నీరజ్ చోప్రా 


భారత్ పక్షాన స్వర్ణ పతాకానికి 
ఆరంభ సూచీ అతడు .....!
జావలిన్ త్రో ....
అతితక్కువమంది ఆలకించే క్రీడ 
అదే మనదేశా నికి 
కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది చూడు
నీరజ్ చోప్రాను 
ఆకాశానికి ఎత్తిందినేడు ....!!
హర్యానా ముద్దుబిడ్డ 
ఆర్మీలో నాయక్ సుబేదార్ 
భారత్ కు మొదటి స్వర్ణం అందించిన 
క్రీడావీరుడు .....
నీరజ్ చోప్రా ...నీకువందనం ...!
భారత్ కీర్తికిరీటమా ....
నీకు శతకోటి వందనాలు ...!!
కామెంట్‌లు