పద్యాలు:ఉత్సాహం ః-అన్నల్ దాస్ రాములుసిద్దిపేట9949553655
చెరువు నిండినంత బ్రతుకు చేరు జీవరాశియున్
కరువు కాటకములు తీరు గౌరవంబు యూరికిన్
పరువు నిలుచు మనిషికంత పంటలన్ని పండగన్
బరువుదీరు బతుకునందు బాగ వృద్దిజెందగన్

దరువుయున్న పాట నిలుచు దానికెంతొ కీర్తిరా
అరువుయున్న వానికెపుడు అదరణంబు తగ్గురా
బురుగు యెంతసేపు నిలుచు బురిడి గొట్టవద్దురా
మరువ వద్దు మాటముద్దు మనిషికెంతొ పరువురా

      


కామెంట్‌లు