*ద్విత్వాక్షర గేయాలు**బ-బ్బ ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అబ్బాయి మబ్బుల లేచిండు
టబ్బులో నీటిని చూసిండూ
సబ్బుతో తానం చేసిండూ
జుబ్బా కొత్తది తొడిగిండూ
డబ్బాలో డబ్బులు వెదికిండు
జుబ్బా జేబులో దాచిండూ
దుబ్బాక ఊరు వెళదామనీ
దబ్బదబ్బ బయటికి నడిచిండు
దబ్బున బురదలో జారిండూ
దెబ్బలు తగిలి ఏడిచిండూ

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
మీ ద్విత్వాక్షరాల
ప్రయోగం బాంగుది మేడం
అభినందనలు.
----డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.