శివ పూజ (తేట గీతులు ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

హరుని పూజకు యలివేణి హారతిచ్చి 
నంది కడకును తానొచ్చి నయము గాను 
పసుపు కుంకుమ నలదియు పావనికిని 
బసవ కావుము యనుచును భక్తి గొలిచె !

ఏమి భాగ్యము స్వామికి ఎదురుగాను 
నిరత సేవకు నోచిన నీకు బసవ 
మాట జెప్పుము విభునికి మమ్ము బ్రోవ
గరిక తినిపింతు ననివేడి గంట కొట్టె !


కామెంట్‌లు