శిక్కుగురువు అర్జున్ దేవ్ కి ముందు నలుగురు గురువులు ఉండేవారు. ఈయన ఐదోవాడు.మన ఆర్యభూమిలో యవనుల ప్రాబల్యం పెరగడం తో గురునానక్ భారతీయ ఉదారత విజ్ఞానం ప్రపంచంకి తెల్పాలని ఏకేశ్వరవాద అంధవిశ్వాసాలను తరిమే సిక్కు మతాన్ని స్థాపించాడు. నానక్ తర్వాత అంగద అమరదాస్ రామదాస్ వారి వారసుడు అర్జున్ దేవ్ నిగూర్చి తెలుసు కుందాం.
1563లోపుట్టిన అర్జున్ ని బాగా పరీక్షల్లో నెగ్గినతర్వాతనే తండ్రి రామదాసు తన ఉత్తరాధికారిగా నియమించారు. పృధ్వీచంద్ అనే ఇతని అన్న ఈర్ష్య అసూయతో రగిలిపోయాడు.1581లోతండ్రి ఆస్తిని సమంగా పంచినా అతనికి తృప్తి కలగలేదు. అర్జున్ అమృతసర్ ని సుందరం గా తీర్చిదిద్దాడు.పంజాబీ భాషలో గ్రంథసాహిబ్ ని రాశాడు.కబీర్ నాందేవ్ జయదేవ మీరాబాయి మొదలైన భక్తుల ఉపదేశాలని సంకలనం చేశాడు. అమృత సర్ మందిరంలో నిత్యవిధిపూర్వకపూజలు గ్రంథసాహిబ్ పఠనంని ఏర్పాటు చేశాడు.ఇవన్నీ అన్నకి కంటగింపుగా మారాయి.కుట్రలు పన్నసాగాడు.ఆబాధలు భరించలేక అర్జున్ బాదలీ అనే గ్రామంలో స్థిరపడినాడు.ఇక్కడే అతని కి హరగోవింద్ అనే కొడుకు కూడా పుట్టాడు దీనితో పృధ్వీచంద్ లోకోపం అసూయ ద్వేషం కసి పెరిగాయి. గ్రంథసాహిబ్ లో హిందూముస్లింలపై అర్జున్ విషబీజాలు నాటాడని అక్బర్ పాదుషాకి ఫిర్యాదు చేశాడు.అక్బర్ స్వయంగా అమృత సర్ వచ్చి ఆ ఆరోపణ అబద్ధం అని నిర్ధారించాడు.అతను చనిపోగానే గద్దె నెక్కిన జహంగీర్ సిక్కులను అణచసాగాడు.2లక్షలజుల్మానాని అర్జున్ పై విధిస్తే కట్టను అని నిరాకరించాడు.అతనిని బందీగా చేసిన జహంగీర్ క్రూరుడైన చండూషాహ్ ఆధీనంలో ఉంచాడు.ఆదుర్మార్గుడు శారీరకంగా మానసికంగా అర్జున్ ని కాల్చుకుని తిన్నాడు.చాలా క్రూరంగా అర్జున్ ని చంపిన విధానం చదివితే ఒళ్ళు జలదరిస్తుంది. ఒక పెద్ద కట్టెలపొయ్యిపై పెద్ద ఇనుప కళాయిని పెట్టి దానిపై అర్జున్ ని కూచోపెట్టి కింద మంటపెట్టాడు. పైనించి సలసలకాగే నూనెను పోశాడు. గురు అర్జున్ శాంతంగా ఇలా అన్నారు "దుర్బలులకి ఆధారం ఆ భగవంతుడే" సిక్కుల రక్తం సలసల మరిగింది.అప్పుటి నించి అస్త్ర శస్త్రాలతో తమ ధర్మ రక్షణ కై నడుం బిగించారు. ఇదీ గురు అర్జున్ ని గొప్ప తనం.మరి ఇప్పుడు మనకి తెలుస్తున్నది కదా దుర్మార్గుల అకృత్యాలు?చూస్తున్నాంకదా? బలమైన ప్రభుత్వం కి అండగా ప్రజలు ఉండకపోతే భవిష్యత్తు ఇలాగే ఉంటుంది మరి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి