గెలుపు !ఓటమి !!అను మామునూరు ముచ్చట .: > శ్యామ్ కుమార్ నిజామాబాద్ *

 ఒక పని మొదలు పెట్టడానికి లేదా ఒక కొత్త విషయంలో తలదూర్చడానికి ప్రతి వారికి కూడా వారి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు మనసులో  నిగూఢంగా ఉంటాయి. 
  నేను  ఎన్ సి సి  లో   చేరడానికి కావడానికి ముఖ్యకారణం వాళ్ళిచ్చే షూస్ మరియు డ్రెస్.  ఆ మిలటరీ షూస్ వేసుకొని నడుస్తుంటే ఉండే మజానే వేరు.  చెమటలు పడుతూ  చచ్చి ,చెడి  పరేడ్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చే పూరీలు, అరటిపళ్ళు ఎంతో రుచికరంగా ఉండేవి.  ఎన్సిసి క్లాస్  అవుతున్నంత సేపు నా దృష్టి అంతా వాళ్ళిచ్చే రి ఫ్రేష్మెంట్ మీదనే ఉండేది.
 వెంకటేశ్వరరావు సంజీవన్ వకీలు గోపాల్ రెడ్డి  పుండరీ గౌడ్,  K.అశోక్ ,మదన్ మోహన్ రెడ్డి  నాగరాజు చిటికెల నర్సారెడ్డి,  ఈగ గంగారెడ్డి  ,మహేందర్ రెడ్డి , సత్యనారాయణ, మేమందరం ఒక టీం సభ్యులము .  ప్రతి సంవత్సరం కూడా ఎన్సిసి ట్రైనింగ్ క్యాంప్ పది రోజులు ,ఎక్కడైనా దూరంగా ఒక అడవిలో నిర్వహించబడేది .   ఒక సంవత్సరం మా కాలేజీ నుంచి దాదాపు 30  విద్యార్థులను   సెలెక్ట్ చేశారు.  అత్యుత్సాహంతో చాలా హడావిడి చేస్తూ హనుమకొండ  దగ్గరలో ఉన్న  మామనూర్ అనే క్యాంపుకు బయలుదేరి వెళ్లాం.  కాలేజీ లో ఉన్నప్పుడు పుస్తకాలు, చదువు కంటే కూడా ఇటువంటి కార్యక్రమాల మీద ఆసక్తి చాలా  ఉండటం సహజం.
 అందరం హనుమకొండ బస్టాండ్ లో దిగి అక్కడి నుంచి మామనూరు వైపు వెళ్లే ఎర్ర బస్సు ఎక్కాం.  ఎన్సిసి క్యాంపు కు వెళ్లే దారి దగ్గర  బస్సు ఆపమని డ్రైవర్ కి చెప్పాం.  ఆ స్థలంలో  దిగేటప్పటికి మాకు చాలా రాత్రి అయిపోయింది. రోడ్డు పక్కన ఉన్న మట్టి దారి వైపు సూచిస్తూ ఒక  NCC బోర్డు కనిపించింది.  మమ్మల్ని క్యాంపు వరకు తీసుకెళ్లడానికి అక్కడ ఎన్సిసి వ్యాన్ ఉంటుందని అనుకున్నాం. అయితే అక్కడ అలాంటిదేమీ కనిపించలేదు .  కనీసం అడగడానికి ఒక మానవమాత్రుడు కూడా చుట్టుపక్కల ఎక్కడా లేడు.  చుట్టూ చిమ్మ చీకటి. మమ్మల్ని వదిలేసి ఎర్రబస్సు   దడ దడ లాడు కుంటూ దుమ్ము రేపు కుంటూ వెళ్ళిపోయింది .  ఎన్ సి సి వాళ్ళు పెట్టిన బోర్డ్  చూస్తే అది అడవిలో కి దారి చూపిస్తూ ఉంది.    అది ఎవరూ తిరగని మట్టిరోడ్డు , చుట్టూ దట్టమైన అడవి,  కీచురాళ్ళ చప్పుడు.  అందరికీ ఆకలితో కడుపులు  నకనక లాడుతున్నాయి. సరే, ఇంక ఏమి చేయలేక ఎంత దూరమో కూడా తెలియదు ,అయినా సరే   అందరం ఈసురోమంటూ నడక మొదలుపెట్టాము.  తలా ఒక మాట ,కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ మొత్తానికి ఎన్సిసి క్యాంపు చేరుకున్నాం.  దాదాపుగా  50 టెంట్లు వేసి ఉన్నాయి కిరోసిన్ దీపాలు , కొన్ని చోట్ల  పెట్రోమాక్స్ లు ఉన్నాయి . 
దూరంగా  టాయిలెట్స్ కట్టించారు. .మేము ఒక టెంట్లో దాదాపు 10 మంది పడుకున్నాం. 
 ఉదయం లేచి 8:00 కల్లా అందరూ రెడీ కావాలి.
 ఇంతలో గోపాల్ రెడ్డి అందరినీ ఒక మగ్గు కావాలని అడగడం మొదలు పెట్టాడు  టాయిలెట్ కు వెళ్ళటానికి .  అయితే ఎవరూ ఇవ్వలేదు. కొద్ది సేపు నిలబడి అందర్నీ చూశాడు పరికించి.  అప్పుడు ఒక నిట్టూర్పు విడిచి
" ఓకే.  సరే! ఇంక ఏం చేద్దాం. తప్పదు, నా   మగ్గు తీసుకొని వెళతాను" అన్నాడు.  
"మరి నీ   మగ్గు ఉన్నప్పుడు మా  మగ్గు   ఎందుకు అడిగావు?" అని అన్నారు అందరు.
 "టాయిలెట్ కి వెళ్తున్న కదా? నా    మగ్గు ఎందుకు పాడుచేసుకోవడం"  అని  నవ్వుతూ వెళ్లిపోయాడు. దాంతో మేమందరం కూడా పగలబడి నవ్వాము. 
 కారణం తెలియదు గానీ క్యాంపు మొత్తం లో ఉన్నా 400 మంది లో   నిజామాబాద్ నుంచి వచ్చినామేము  30  క్యాడెట్ట్స్   అన్నిట్లో ముందుండటం మొదలుపెట్టాం.  అన్నిటా ప్రైజులు మావే.  బెస్ట్ టెంట్  బెస్ట్  క్యాడెట్
 బెస్ట్ పరేడ్, బెస్ట్ షూటర్  అన్నీ మావే.  బెస్ట్ షూటర్గా ఎం వి రావు.  జూనియర్ అండర్ ఆఫీసర్గా   వకీలు సంజీవన్   ఉన్నాడు.  నేను మరి గోపాల్రెడ్డి ఇద్దరం సార్జంట్ గా ఉన్నాము.
 ఒకరోజు పరుగు పందెం ఎనిమిది కిలోమీటర్లు అని   రమ్మని పిలిచారు.  మాలో ఎవరూ కూడా అథ్లెట్ కాదు.   సంజీవన్ మాత్రం ఆటలలో  చురుగ్గా  పాల్గొంటాడని, అక్కడ ఉంటాడని మాకు కాస్త తెలుసు.  నల్లటి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని సంజీవన్  వెళ్ళాడు.  మాలో మరెవరూ పాల్గొనడానికి వెళ్లలేదు  . మేమందరం క్యాంపు బయట ఫినిషింగ్ లైన్ దగ్గర   చెట్ల కింద కూర్చుండిపోయాము.  పందెంలో పాల్గొనే   క్యాండిడేట్స్ అందరినీ ఒక వ్యాన్లో కూర్చోబెట్టుకొని ఆరు కిలోమీటర్ల అవతల దింపడానికి ఎన్సిసి  మిలిటరీ  ఆఫీసర్స్ వెళ్ళిపోయారు. అంటే అక్కడి నుంచి క్యాంపు వరకు అందరూ పరిగెత్తుకొని రావాలన్నమాట. మాకందరికీ  ఆ పరుగుపందెం మీద పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే మాకు అందులో బహుమతి వచ్చే దాఖలాలు ఎక్కడా కనబడలేదు.  కానీ మా సీనియర్ అండర్ ఆఫీసర్  ఎమ్ .వి. రావు మాత్రం
" లేదురా, మన వాడు   ఫస్ట్ వస్తాడు!! .  వాడు  ఈ ప్రైజ్ కొడతాడు చూడు !!!"అని చెప్పాడు.
 ఒక గంట గడిచిన తరువాత దూరంగా  ,మండుటెండలో మట్టి రోడ్డు మీద చిన్నగా, తెలుపు రంగు నిక్కరు తెలుపు షర్టు వేసుకొని ఒక అబ్బాయి పరిగెత్తుకొని  రావడం కనిపించింది. వాడి వెనకాతల కనుచూపు మేరలో మా సంజీవన్   ఎక్కడా కనిపించలేదు.  దూరంగా రంగు  రంగుల  దుస్తుల్లో   చాలా మంది వస్తూ కనిపించారు . నలుపు డ్రస్సు సంజీవన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు .  "సరేలే  ముందే    అనుకున్నాము    కదా" అని  సర్ది చెప్పుకున్నాము.  అందరి కంటే ముందుగా ఉన్న  అబ్బాయి దగ్గరగా వస్తున్న కొద్ది మాకు వాడు సంజీవన్  లాగా కనిపించడం మొదలు పెట్టాడు.  దూరంగా వస్తున్న వాణ్ని మేము పరికించి , కళ్ళు చిట్లించి చూడడం మొదలు పెట్టాం. ఆ పరుగులో వస్తున్న అబ్బాయి దగ్గరికి వస్తున్న కొద్దీ   వాడు సంజీవన్ లాగాఉండడమే కాదు వాడే సంజీవన్  అని మాకు అర్థమైంది.  మా  సంతోషానికి అవధులు లేవు.  అందరూ లేచి నిలబడి" కమాన్ కమాన్ !సంజీవన్!!"  అంటూ అరవడం మొదలు పెట్టారు.  అందరి మొహాల్లో అంతులేని ఆనందం,  ఇక అందరూ గాలిలోకి ఎగరటం మొదలుపెట్టారు.  మా అరుపులు కేకలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లి పోయింది.     అందరూ ఒకరినొకరు పట్టుకొని డాన్సులు చేయడం మొదలు అయ్యింది. చెమటలు కక్కుతూ వగరుస్తూ సంజీవన్   ఫినిషింగ్ లైన్   అందరి కంటే ముందు దాటేశాడు.  రెండవవాడు మూడోవాడు ఎక్కడో చాలా దూరంగా రావడం కనిపించింది.  లైను దాటగానే కిందపడిపోయాడు సంజీవన్.   కుడికాలు యొక్క  పిక్క కండరం పట్టేసింది.  సంజీవన్  అరవడం మొదలు పెట్టాడు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు.  అందరం  కాలును   పైకి లాగుతూ ఆ కండరాన్ని కిందికి  నొక్కుతూ మసాజ్ చేయటం మొదలుపెట్టాం. 
 అందరం సంజీవన్ ను మోసుకుంటూ క్యాంపుకు వెళ్ళిపోయాం.  మొత్తానికి ఆరోజు సంజీవ  ఇచ్చిన షాక్తో అందరం  ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో మునిగి  పోయాం.
 ఉదయాన్నే సామూహికంగా చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చేది.  నవంబరు నెల కావడం వలన  చలిగా ఉండేది వాతావరణం.    ఆ తర్వాత పరుగు కార్యక్రమం ఉండేది. అందరినీ  చెట్ల వెంబడి , పుట్ల  వెంట పరిగెత్తిచ్చేవారు.  అది పూర్తయ్యేసరికి  అందరి ఒళ్ళు హూనం  అయ్యేది.  అప్పుడు  పొడవాటి క్యూలో నిలబడి, అల్యూమినియం కప్పుల్లో నీళ్ళ  చాయ్, డబుల్ రొట్టె వేడివేడిగా తింటూ ఉంటే  అందులో ఉండే ఆనందం  రుచి అంతా ఇంతా కాదు.
  ఇక మా సీనియర్ అండర్ ఆఫీసర్, స్నేహితుడు అయిన వెంకటేశ్వరరావు గురించి చెప్పాలంటే చాలా  చిత్రమైన వాడు మిల్ట్రీ ఆఫీసర్ ల కంటే కూడా ఇంకా ఎక్కువ సీరియస్ గా, క్రమశిక్షణతో ఉండేవాడు.    ఒక రోజు ఏం జరిగిందంటే, రోజంతా ఎండలో పరేడ్  చేసిన తర్వాత చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని  కూర్చోబెట్టాడు మా సీనియర్ అండర్ ఆఫీసర్., బాగా అలసిపోయి చెమటలు కక్కుతున్న మేము బ్రతుకుజీవుడా అనుకుంటూ అలా కూర్చున్నామొ లేదో  
,అటువైపు నుండి దూరంగా వెళ్తున్న క్యాంపు కమాండెంట్ ను గమనించి,  మమ్మల్నందర్నీ లేపి అటెన్షన్ లో  నిలబెట్టి ,పరేడ్ కొనసాగించి ఆయనకు సెల్యూట్ కొట్టించాడు  మా సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం వి రావు రావు . మేము అందరం    విసుక్కున్నాము   "ఇది అవసరమా? అక్కడెక్కడో వెళ్తున్న ఆయనను చూసి మనం ఇక్కడ లేచి  పరేడ్ చేసి  సెల్యూట్ అన్నది చాలా ఎక్కువ .  మరీ అతిగా చేస్తున్నాడు మా సీనియర్ అండర్ ఆఫీసర్  " అని .
 కానీ మరుసటి రోజు  మేమందరం ఊహించని పెద్ద బహుమతి లభించింది .బెస్ట్ పరేడ్ ,బెస్ట్ టీం కింద మాకే బహుమతి ప్రధానం చేశారు.  అంతేకాకుండా మాకు క్యాంపు లీడర్ గా ఎన్నిక చేశారు .  అప్పుడు మాకు అర్థమైంది మా సీనియర్ అండర్   ఆఫీసర్ యొక్క  డిసిప్లేన్ ఎట్లాంటిదో , దానివల్ల కలిగే లాభాలు ఏంటో.
 ఈ విధంగా అన్నిట్లో మా జైత్ర యాత్ర కొనసాగింది .   ఐదో రోజు మావద్ద క్యాంపులో కబడ్డీ మొదలయ్యింది.  అందర్నీ ఓడిస్తూ మేము ఫైనల్స్ కు చేరుకున్నాం.   ఎంతో ఉత్తేజంతో అన్ని గెలుచుకుంటే వస్తున్న మాకు కబడ్డీ ఫైనల్ లో వరంగల్ టీం తోటి చాలా పోటీ ఏర్పడింది.  అప్పుడు మా గ్రహఫలాలు అడ్డం తిరిగాయి. మాకందరికీ కబడ్డీలో ఓటమి  కనిపించసాగింది. ఆడుతున్న కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే   గెలవడం చాలా కష్టం అని.   కబడ్డీ లో వరంగల్ టీం ను ఓడించడం దాదాపు అసంభవం అనే   పరిస్థితులు వచ్చాయి.  ఆఖరులో ప్రతి ఒక్క పాయింట్ కి గురించి మేము చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది.  ఇది మేము ఊహించని పరిణామం.  మాలో ఎవరికీ కూడ ఆ ఓటమి మింగుడు పడకుండా ఉంది.   నన్ను ఆ సమయంలో లైన్ ఎంపైర్ గా నియమించారు. అంటే ఆట లో ఎవరైనా లైన్ తప్పితే వారిని నేను  బయటకు లాగేసి అవుట్ కింద నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది.  గేమ్ మంచి రసపట్టులో ఉంది. ఒకే ఒక్క పాయింట్ తో మా గెలుపు ఓటమి తెలుస్తుంది. అటువంటి నిర్ణయాత్మక మైన దశలో  మా టీం మెంబరు ఒకరు వెనుక ఉన్న గీతను తొక్కడం  జరిగింది.  అప్పుడు అతడిని నేను అవుట్  అయినట్లుగా ప్రకటించి ఒక పాయింటు కరీంనగర్ కి ఇవ్వాల్సి ఉంటుంది  . అలా చేస్తే మేము  ఓడిపోవడం ఖాయం.  వరంగల్ టీం వాళ్ళు అది చూసి వారికి ఒక పాయింట్ రావాల్సిందిగా డిమాండ్ చేశారు. "లేదు .లేదు మా వాడు ఆ లైను తొక్క లేదు" అంటూ మా వాళ్ళు   మొండి చేశారు.  ఇరువర్గాల వారు మంచి ఆవేశం మీద ఉన్నారు. ఈ విషయం  పై, మొత్తానికి పరిష్కారం  లైన్  ఎంపైర్ దే  కనుక అందరూ వచ్చి నన్ను అడిగారు.  నేను పెద్ద ధర్మ సందేహం  లో ఇరుక్కుపోయాను.  నా బాధ్యత ప్రకారం నిజం చెప్తే అది మా వారి  ఓటమి అని తెలుసు.  అబద్ధం చెబితే అధర్మం కింద వస్తుంది .నిర్ణయాత్మకమైన  న్యాయ నిర్ణయం అన్నది నేను చేయలేకపోయాను.  స్వధర్మమే పరమ ధర్మంగా భావించి నేను మా వాళ్ళని రక్షించడానికి నిర్ణయించుకున్నాను.    మావాడు లైన్ తొక్క లేదని అవుట్ కాలేదని నిర్ణయం ప్రకటించేశాను.  అప్పుడు గొడవలు ఇంకా ఎక్కువైపోయాయి.  వరంగల్ లో జరుగుతున్న ఎన్సిసి క్యాంపు లో వరంగల్ టీం  కాకుండా మొదటి నుంచి నిజాంబాద్   టీం పైచేయిగా ఉంటూ అన్నిట్లో విజయం సాధిస్తున్న మాపై వరంగల్ టీం వాళ్ళకి    అప్పటికే గొంతుక వరకు కోపం ఉంది. వాతావరణమంతా ఉద్రేకపూరితంగా తయారైపోయింది.  వాదప్రతివాదాలు అరుపులతో గ్రౌండ్ అంతా నిండిపోయింది.  అందరూ కండబలం ప్రదర్శించే వరకు వచ్చారు.  వాళ్లలో కొందరు నామీద కోపంతో కొట్టడానికి వచ్చేసారు.  అంతలో మాలో కండలు తిరిగిన  బాడీ బిల్డర్  మహేందర్ రెడ్డి పక్కనున్న ఒక   కర్ర తీసుకుని   గిర గిర తిప్పటం మొదలుపెట్టాడు.  బహుశా తన ఊరిలో నేర్చుకున్న  కర్ర సాము ప్రావీణ్యం అందరికీ ప్రదర్శించాలని  కోరిక కలిగినట్లుంది .   అది చూసి వరంగల్ వాళ్లు అందరూ భయపడి  పోయి దూరంగా జరిగి పోయారు.  మా వాళ్ళందరూ  లోలోన నవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే వస్తాదులా ఉన్నా మహేందర్రెడ్డి నిజానికి చాలా   మెతక స్వభావం కలిగిన వాడు.  కర్ర కాదు కదా  వాడు కత్తి తిప్పిన సరే  మేమందరం  భయపడే సమస్య  లేదు.  ఇంతలో మిలటరీ ఆఫీసర్లు వచ్చి పరిస్థితిని అదుపు చేసి, నా నిర్ణయం  మేరకు నిజాంబాద్ టీంకి బహుమతి  ప్రకటించారు.   మేమంతా గంతులువేస్తూ నృత్యాలు చేస్తూ పండగ చేసుకున్నాం.   కానీ ముందున్నది ముసళ్ళ పండగ  అని మాకు తెలియదు.  మా వాళ్ల దృష్టిలో నేను హీరోగా కరీంనగర్-వరంగల్  వాళ్ల దృష్టిలో విలన్ గా అయిపోయాను. మిగిలిన అన్ని రోజులు కూడా క్యాంపులో మేము  చాలా సంతోషంగా ఉత్తేజపూరితంగా గడిపేశాం.   ఆ రోజు రాత్రి క్యాంపు ఫైర్  వేసి ,చుట్టూ అందరూ డాన్స్ చేశారు ,రకరకాల నృత్యాలు చేశారు .    ప్రతి జిల్లా నుంచి  వచ్చిన అందరూ ఒకరినొకరు ప్రేమతో పలకరించుకొని,  భారమైన హృదయాలతో   వీడ్కోలు చెప్పుకున్నారు.
 మాలో ఒకడైన గంగారెడ్డి  క్యాప్  ఎప్పుడు కావాలని వంకరగా పెట్టుకునేవాడు.  ఎవరైనా దాన్ని సరి చేస్తే ,థాంక్స్ చెప్పి వాళ్లు వెళ్లగానే  పకపక  నవ్వేవాడు. 
 ఈమధ్య కలిసిన గోపాల్ రెడ్డి ఆ క్యాంపులో తనకు    అశోక్( ఇప్పుడు  advocate  )  ఈగ గంగా రెడ్డి పెట్టినట్టి  పేరు ఒకటి గుర్తు చేశాడు. అదేంటంటే ఒకరోజు వంటశాల దగ్గర కూర్చున్న ఆడవాళ్ళు చాట తో  బియ్యం చెరుగుతూ ఉన్నారట.  అది చూసి  గోపాల్ రెడ్డి  " వాళ్ళ ని చూడు ఎంత బాగా బియ్యం  చాట తో  చెరుగుతున్నారు"  అని.   అంతే! మరి మన వాళ్లు గోపాల్ రెడ్డి పేరు" చాట" అని  పెట్టారుట .   ఈ విషయం చెప్పి గోపాల్ రెడ్డి   మనస్ఫూర్తిగా ఆనందంతో తెగ నవ్వాడు.
 మహేందర్ రెడ్డి మంచి బాడీ బిల్డర్ చాలా బలంగా కండలు తేలి ఉండేవాడు. అశోక్, సంజీవరెడ్డి ,మదన్ మోహన్ రెడ్డి , గంగారెడ్డి  ఎప్పుడు అల్లరిగా అందరితో సరదాగా గడిపే వాళ్ళు .ఏది సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు  నలుగురు కూడా ఆ తర్వాత అడ్వకేట్   వృత్తిలో సెటిల్ అయిపోయారు.
 క్యాంపు ఆఖరి రోజున అందరికీ, దారిలో తినడానికి రిఫ్రెష్ మెంట్స్  ఇచ్చారు.  హైదరాబాద్ వెళ్ళటానికి ఎక్కవలసిన ట్రైన్ సాయంత్రం 6 గంటల వరకు లేదు. మమ్మల్ని అందర్నీ ఒక మిలటరీ వ్యాన్లలో ఎక్కించి ఎన్సిసి క్యాంప్ నుంచి స్టేషన్ దగ్గర  దింపేశారు. దాదాపు పది రోజులుగా అందరికీ దూరంగా అడవిలో గడిపిన మా వాళ్ళందరూ హనుమకొండ వచ్చేసరికి రోడ్డు మీద కనిపిస్తున్న అమ్మాయిల ను చూసి కేరింతలు కొడుతూ సంతోషంగా చేతులు ఊపుతూ  వెళ్ల్తున్నారు అందమైన కాలేజీ అమ్మాయిల గుంపు కనిపిస్తే  చాలు, ఇంకేముంది మా వాళ్ళ   అల్లరి ఇంకా ఎక్కువ  అయ్యేది. అమ్మాయిలు కూడా  మిలిటరీ వ్యాన్లో వెళ్తున్న మమ్మల్ని చూసి మా అల్లరి చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లారు. 
 రైల్వే స్టేషన్లో అందరం దిగిపోయాం.  నేను, వెంకటేశ్వరరావు మాత్రము వేయి స్తంభాల గుడికి వెళ్ళవలసిన ప్రోగ్రామ్ ఉండటం మూలాన బ్యాగులు స్టేషన్లో మా వాళ్ళకి ఇచ్చి బయలుదేరి పోయాము .    మా కంటే సీనియర్ విద్యార్థిని  '  శ్రీ దేవి'  కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తూ ఉండేది.  తను వేయి స్తంభాల గుడి చూడమని మాకు సలహా ఇవ్వడం తను కూడా అక్కడ రావడం తో మమ్మల్ని  స్టేషన్లో ఉండకుండా రక్షించింది .
 ఎందుకంటే మేము అటు వెళ్ళిన కాసేపటికల్లా సీకేఎం కాలేజీ నుంచి విద్యార్థులు మా మీద పగ తీర్చుకోవడానికి ఒక వంద మంది రెండు బస్సుల్లో వచ్చి స్టేషన్ లో ఉన్న మా వాళ్ళని   ఒక్కొక్క డిని పట్టుకుని చితకబాది   వెళ్లారు. ఇదంతా తెలియని మేము హాయిగా వేయి స్తంభాల గుడి లో దర్శనం చేసుకొని, ప్రసాదాలు మరియు 'దేవి' తెచ్చిన భోజనాలు తిని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.  మధ్యాహ్నం కల్లా మా  సంజీవన్  గుడికి వచ్చి జరిగినదంతా చెప్పి సీనియర్  అండర్ ఆఫీసర్ అయిన వెంకటేశ్వరరావు ను తీసుకొని వెళ్ళాడు.   కబడ్డీ లో తప్పుడు  నిర్ణయం  ఇచ్చిన ఎంపైర్ గురించి  రైల్వే స్టేషన్ లోచాలాసేపు  వెతికారని తెలిసింది.  నేను దొరకలేదు కానీ,  దొరికినట్లు అయితే నా పని  ఇంకా బ్రహ్మాండంగా చేసేవారు.  అందరికంటే ముందుగా కర్ర  సాము చేసి అందరి మీద  కర్ర గిరగిరా తిప్పిన  మహేందర్రెడ్డి ని వెతికి పట్టుకొని ఉతికేశారు.  మేము స్టేషన్ కి వెళ్ళి చూసేటప్పటికీ అందరూ గాయాలతో ఉన్నారు. కానీ  గమనించి చూస్తే సంజీవన్ కి మొహం మీద ఒక్క మచ్చ గాని దెబ్బకానీ లేదు.  నేను ఆశ్చర్యపోయి అడిగాను "ఏంట్రా నీకేంటి వాళ్ళు కొట్ట లేదా? ఒక దెబ్బ లేదు మొహానికి?" అని.
 అప్పుడు సంజీవన్ మొహమంతా నవ్వుతో, నన్ను చూస్తూ 
" లేదురా వాళ్ళు కొట్టినప్పుడు  మొహం పైకి పెట్టకూడదు, రెండు చేతులతో పట్టుకొని కిందికి వంగాలి . ఆ టెక్నిక్ నాకు తెలుసు ! !   మన హౌలా గాళ్ళకి తెలియదు, అందుకే మొహానికి అని దెబ్బలు పడ్డాయి . అందరూ మొహాన దెబ్బలు తిన్నారు.  వాళ్లు కొడుతుంటే మనవాళ్ళు మొహాలు ఇంకా పైకి పెట్టారు"  అని మరింత సంతోషంతో చెప్పి,  కిలకిల నవ్వటం మొదలు పెట్టాడు.
 అందరూ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లి ఆ విద్యార్థుల మీద ,వాళ్లను తీసుకొచ్చిన లెక్చరర్ మీద కంప్లైంట్  ఇచ్చారు.  వారి ఇంచార్జి లెక్చరర్  ను కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. 
 ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని వచ్చి మేము  నిజాంబాద్ కి తిరుగు ప్రయాణం  మొదలుపెట్టాం.  మామునూర్ క్యాంప్ లో మేము చేసిన అల్లరి, డామినేషన్, అన్నిటా మా యొక్క  నాయకత్వం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేను.  మాలో   ఉన్న ప్రతి ఒక్కరికి విపరీతమైన శక్తియుక్తులు తేజం ధైర్యం తెలివి అమోఘం.  విజయాన్ని మించింది ఏదీ లేదు విజయానికి మించి ఏది  మాకు నచ్చదు అన్న ప్రిన్సిపల్ని చేసి చూపించారు .  మా కాలేజీలో చదివిన, ఇందులో పాల్గొన్న అందరి జీవితాలని పరికించి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే అందరూ ఉన్నత స్థానాల్లో విజయం సాధించి జీవితంలో చాలా బాగా స్థిరపడ్డారు.   దాదాపుగా అందరూ ఎన్ సి సి లో   "C" సర్టిఫికెట్ పాస్ అయ్యి, ఆ సర్టిఫికెట్ తో పోస్ట్గ్రాడ్యుయేషన్ సీట్ల గురించి మరియు ఉద్యోగాల గురించి బయట ప్రపంచంలో పడ్డాం. మా ఎన్సిసి గ్రూప్ ఫోటోలు చాలావరకు నర్సారెడ్డి దగ్గర దొరికాయి.  మేము జీవించినంత కాలం మాకు మామునూర్ ఘటన అన్నది చాలా   విలువైనదే  కాక  అత్యంత మధురమైనది కూడా.

కామెంట్‌లు
శ్యామ్ కుమార్ చెప్పారు…
ఎడిటర్ శ్రీ వేదాంత సూరి, DrKLV ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు
Shyamkumar చెప్పారు…
NCC annual training camp. 1977
Nice narration 👍👏

75-76 one camp we participated at govt. degree college Siddipet

76-77. One camp was at a village near to our NCC firing range. I did not participate since I completed 2 camps required for C certificate. My friend Badruddin of Karimnagar - jagityal was the senior under officer.
🤝
Sujatha. Thangudu. Mumbai చెప్పారు…
Hi
I like life of forest
It is really nice
శ్యామ్ కుమార్ చెప్పారు…
Dr klv ప్రసాద్ గారు ఈ సారి ఎడిటింగ్ చెయ్య లేదు
దుర్గ భవానీ. చెన్నై చెప్పారు…
శ్యామ్ గారు మీరు స్కూల్ ,కాలేజ్ రోజులు గురించి వివరాలు చాలా బాగా గుర్తుచేసుకుని తెలియచేస్తూనందుకు సంతోషం కలుగుతుంది. మీరు స్నేహానికి ఇంత విలువ ఇవ్వాలనుకోవడం నిజంగా అభినందనలు👌👏👏🙏👍
Raju myaakala. Siddipet చెప్పారు…
యుద్ధం లో విజయం
విజయం కోసం యుద్ధం....చాలా బాగుంది సర్.
కృష్ణా శాస్త్రుల సుబ్రహ్మణ్యం. Manager .New india assurance co. Hyderavi చెప్పారు…
కథలు చాలా బాగా ఉన్నాయి. రచన శైలి ఆకట్టుకుంటుంది. అభినందనలు.
T raghavender . Dir.higher edu. హైదరాబాద్ చెప్పారు…
Adventures unforgettable incident very nice👌👌👍
సుబ్రమణ్యం. ప్రిన్సిపాల్. Kendiya vidyalaya. Hyderabad చెప్పారు…
👌👌 beautifully explaned the past glorious period. It is essential to recall friends n helpers 👍
Unknown చెప్పారు…
Shyam, I like the way you narrates the events that took place in your life journey!
I am happy to note that a very interesting writer in you is coming out with wonderful
Expressions & fantastic presentation skills!
నారా వెంకటేశ్వర రావు. (BSNL.) Writer, director. చెప్పారు…
గెలుపు, ఓటమి కథ చాలా ఉత్కంఠభరితంగా అత్యంత వేగంగా సాగింది. మీ friend Sanjay పరుగు పందెంలో గెలవడం కోసం మీ అందరి తపన నిజమైన స్నేహాన్ని సూచిస్తుంది.if we share happy with others it will be multiple. If we share our problems with friends it will be half.Real friends plays most important Role in it.Relatives also don't share like Real friends. It's Being proved in your real story sir. అద్భుతమైన రచయిత అయిన మీకు నిజ జీవితంలో కూడా కళాశాల ప్రాంగణంలో ఉత్సాహభరితమైన కథాంశాలు దొరకటం కూడా మీ అదృష్టం. క వి త కు మకుటం ఎలా ముఖ్య మో, రచయితకు ప్రధానాంశం కథ. ఆటల పోటీలలో రిఫరీ పాత్ర అత్యంత కీలకమైన మరియు risks తో కూడిన పాత్ర. అదీ మీ విషయం లో రుజువైంది. ఆ సమయంలో సాహసోపేతమైన నిర్ణయం మీధైర్యానికి ప్రతీక. స్వపక్షానికి కొంతయినా మేలు చేయటం మానవ ధర్మం. ఒకరి నిజ ప్రవర్తన తెలుసుకోవాలంటే ఆరుగురు అతని స్నేహితుల వివరాలు తెలుసుకోవాలి అంటారు. మీ స్నేహితులు అందరూ మేధావులు , sacheelulu , వినోదఅభిలాషులు కావటం విశేషం. అది యాధృక్షికం కాదు.
అదృష్టం మాత్రమే. కళాశాల లో గడిపిన రోజులు దశాబ్దాలు గడిచినా ,ఇంకా స్నేహితులందరి పేర్లు, వృత్తులు తదితర విషయాలు గుర్తుంచుకోవటం మీ విశేష ప్ర జ్ఞ కు, జ్ఞాపక శక్తికి, విజ్ఞతకు నిదర్శనం. రచయిత కు కావలసిన ముఖ్యమైన విషయం విశ్లేషణ, పరిశీ లనా శక్తి. అవి మీకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మీరు నేను మెచ్చిన మంచి రచయత.👌👌👌👌👍👍👍👍👍👍🤝
సవరణ.. అందరూ మెచ్చిన రచయిత శ్యామ్ కుమార్ గారు.
నారా వెంకటేశ్వర రావు. (BSNL.) Writer, director. చెప్పారు…
గెలుపు, ఓటమి కథ చాలా ఉత్కంఠభరితంగా అత్యంత వేగంగా సాగింది. మీ friend Sanjay పరుగు పందెంలో గెలవడం కోసం మీ అందరి తపన నిజమైన స్నేహాన్ని సూచిస్తుంది.if we share happy with others it will be multiple. If we share our problems with friends it will be half.Real friends plays most important Role in it.Relatives also don't share like Real friends. It's Being proved in your real story sir. అద్భుతమైన రచయిత అయిన మీకు నిజ జీవితంలో కూడా కళాశాల ప్రాంగణంలో ఉత్సాహభరితమైన కథాంశాలు దొరకటం కూడా మీ అదృష్టం. క వి త కు మకుటం ఎలా ముఖ్య మో, రచయితకు ప్రధానాంశం కథ. ఆటల పోటీలలో రిఫరీ పాత్ర అత్యంత కీలకమైన మరియు risks తో కూడిన పాత్ర. అదీ మీ విషయం లో రుజువైంది. ఆ సమయంలో సాహసోపేతమైన నిర్ణయం మీధైర్యానికి ప్రతీక. స్వపక్షానికి కొంతయినా మేలు చేయటం మానవ ధర్మం. ఒకరి నిజ ప్రవర్తన తెలుసుకోవాలంటే ఆరుగురు అతని స్నేహితుల వివరాలు తెలుసుకోవాలి అంటారు. మీ స్నేహితులు అందరూ మేధావులు , sacheelulu , వినోదఅభిలాషులు కావటం విశేషం. అది యాధృక్షికం కాదు.
అదృష్టం మాత్రమే. కళాశాల లో గడిపిన రోజులు దశాబ్దాలు గడిచినా ,ఇంకా స్నేహితులందరి పేర్లు, వృత్తులు తదితర విషయాలు గుర్తుంచుకోవటం మీ విశేష ప్ర జ్ఞ కు, జ్ఞాపక శక్తికి, విజ్ఞతకు నిదర్శనం. రచయిత కు కావలసిన ముఖ్యమైన విషయం విశ్లేషణ, పరిశీ లనా శక్తి. అవి మీకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మీరు నేను మెచ్చిన మంచి రచయత.👌👌👌👌👍👍👍👍👍👍🤝
సవరణ.. అందరూ మెచ్చిన రచయిత శ్యామ్ కుమార్ గారు.
Vinutha ramana. Safilguda చెప్పారు…
It's amazing story sir👏👏👏
Mee kashtalanni navvuthu navvisthu marichipoyaru. Very inspiring incidents sir.
A. VINUTHA RAMANA
PRIMARY TEACHER
DAV PUBLIC SCHOOL
SAFILGUDA.

Secundrabad
Subramanyam చెప్పారు…
It's amazing story sir👏👏👏
Mee

👌👌 beautifully explaned the past glorious period. It is essential to recall friends n helpers 👍
Sri. Subramanyam sir
Reted. Principal,
Kendriya Vidyalaya,
Hyderabad Region

Secundrabad
Chittayya చెప్పారు…


Sweet are ever cherished Anna 👍Chittayya, KV, Teacher
Tirmalgerry, Secundrabad
Vinutha ramana. DAV public school hyd చెప్పారు…
It's amazing story sir👏👏👏
Mee kashtalanni navvuthu navvisthu marichipoyaru. Very inspiring incidents sir.
A. VINUTHA RAMANA
PRIMARY TEACHER
DAV PUBLIC SCHOOL
Hyderabad
Lingam bhongir చెప్పారు…
Anna mamunoor antey mudunalla muchatani wrong gaa chepputhunnavani, nee NCC story lo kee diganu, neevu mundununchi dairy rasukuney habit vunnda brother, eppudo jarigina sangatanalu, ippudey jarigithey, vunnatulu vivaristavu, subhakanshamulu anaa nee memory kee, very nice , indulo Ekkada love story ledu bro
Lingam bhongir చెప్పారు…
Anna mamunoor antey mudunalla muchatani wrong gaa chepputhunnavani, nee NCC story lo kee diganu, neevu mundununchi dairy rasukuney habit vunnda brother, eppudo jarigina sangatanalu, ippudey jarigithey, vunnatulu vivaristavu, subhakanshamulu anaa nee memory kee, very nice , indulo Ekkada love story ledu bro
B N L kamesweri. Retd. Sub registrar.nagarjuna sagar చెప్పారు…
Goodmorning ncc certificate gives support to our education qualification at the time of job that's why I also joined ncc n got j1certificate after that our ncc teacher transferred to pylon. Really it was also leaves very sweet memorable incidents at camp. Tq u syamgaru .