అమ్మ నాన్నల స్పూర్తి ( బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

గోరుముద్దలు పెట్టి అమ్మ
నూరు మాటలు నేర్పును
చేయి పట్టుకుని నాన్న
అలుపులేని నడక నేర్పును

అమ్మ చెప్పే మాటలన్నీ
మంచి మాటలుగా పలుక
ఇరుగు పొరుగు వారు
ఆత్మ బంధువు లై ఉందురు

నాన్న నేర్పిన నడక తోడ
బ్రతుకు లోన తడ బడక
ఆచితూచి అడుగులేస్తె
బ్రతుకంతా పూల దారి

అమ్మ నాన్నల స్ఫూర్తితో
చేసే ప్రతి పనిలో కీర్తి
బ్రతుకంతా ఘనకీర్తితో
బ్రతుకుదెరువు ఒక స్ఫూర్తి

కామెంట్‌లు