సీసమాలిక
మూడు మతములకు
మూలమై నిలిపెను,
హైందవ సంస్కృతి నందజేసె
ఎల్లోర గుహలందు యెంతో యద్భుతముగ
నిర్మించినారుగా నిలన మనకు,
భారతీయ కళలు భవ్య మై వెలుగొంది
దేవతా చరితల తీరు తెలిపె,
గుహలలో శిల్పాలు గోముగా చెక్కించి
జాతి కీర్తిని పెంచె జగతి నందు,
జైనులు బౌద్ధులు చరణధారీయను
కొండల నుండి యు కూర్చె గుహలు,
గుహలన్ని వెనువెంట గొప్పగా నిర్మించి
రాతి శిల్పకళ ను రాశి వోసె,
కొండలను తొలిచి గుహలుగా మలచగా
పర్యాటక కేంద్రంగ పరిఢవిల్లె
ఆచంద్ర యార్కము నాలవాలముగాను
కట్టడాలు గనగ ఘనత తెలుపు,
తేటగీతి
నాటి చరితలు గమనించ నరుల బ్రతుకు,
శాశ్వతము కాదని తెలిసి జగతి నందు,
తాను పోయిన నిలవాలి తనదు పేరు,
తెలుపుచున్నాయి శిల్పాలు తేజ మలర.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి