హితకారి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 జీవక్రియకు దోహదం
జీర్ణప్రక్రియకు చేతనం
పూర్వులు చెప్పిన ఉపాయం
ఆయుర్వేదం చూపిన ఆచరణం
ఆరోగ్యానికి చక్కని ఉపాయం
దైవానికి దగ్గరి మార్గం
లంఖణం పరమౌషధం
సర్వులు ఆచరించదగ్గ సూత్రం
వైద్యులు చెప్పే అవసరం
శరీరం కోరే సాయం
వ్యాధులను నివారించే పరిష్కారం
అవగాహనతో కలిగే ఆనందం
మాసానికొక్కసారైనా చేయాలి.
ఆహారాన్ని అదుపులో ఉంచాలి.
స్వస్థతను తప్పక పొందాలి.
నియంత్రణే అవసరమని తెలియాలి.
ఎవరికి వారు తెలుసుకొని పాటించాలి.
కామెంట్‌లు