మిల మిల మెరిసే సూర్యుడు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 పండూ, పండూ ఏం పండు?.
నారింజ రంగు పెద్ద పండు
ఎక్కడ ఎక్కడ ఉంటుంది.
ఆకాశంలో ఉంటుంది.
పొద్దున నా నీళ్ళలో
సాయంత్రం కొండల్లో
అందంగా మెరిసే పండు.
దాన్ని తినలే ము
ఆకలి తీర్చుకోలేము
కంటికి కనిపించకుంటే
జీవమే నిలువదు.
హరివిల్లు మెరిసినా
చెరువులు నిండినా
చే లన్ని పండినా జగతికి ఆధారం.
జీవకోటికి ప్రాణాధారం.
ఎర్రని పండు చేసే మాయలే
అది బంగారు సూర్యుడి మెరుపు లే.

కామెంట్‌లు