@ఆర్జించుకున్న సంపద, విజ్ఞానం, సదుపాయాలకన్న మనిషి విలువైనవాడు. ఎక్కిరాల కృష్ణమాచార్య
@ఆవేశము, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేసే గొప్ప విరుగుడు 'శాస్త్ర విజ్ఞానం'.ఆడమ్ స్మిత్
@ఉపయోగకర పుస్తకాలు చదవడం ద్వారానే వ్యక్తి విజ్ఞానం పొందగలడు. వర్డ్స్ వర్త్
@ఎంత ఉపయోగించినా తరగని, అరగని ఉత్పత్తి సాధనం విజ్ఞానం మాత్రమే. జె. యమ్. క్లార్క్
@ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం వుంటాయి.
@ఏదైనా పనిని పూర్తి చేయాలంటే కావలసిన సాధనం విజ్ఞానం.
@కంటికి స్పష్టంగా కన్పించే ఆస్తి విజ్ఞానం.
@ధర్మం దైవదత్త విజ్ఞానం. మతం మానవ నిర్మితం.
@క్రమపద్దతిలో సువ్యవస్థరీకరింపబడిన లోకజ్ఞానమే విజ్ఞానం. ధామస్ హెన్రీ హక్స్ లే
@చెలమలో నీరు తీసిన కొద్దీ ఊరినట్లు చదివిన కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. జి.ముర్రే
@జననం నుంచి మరణం దాకా విజ్ఞానం సంపాదించు.అంతకు మించిన సంపద ఏదీ లేదు. ఖురాన్
@జాతి సృష్టించిన విజ్ఞానాన్ని ఎంత బాగా వాడుకుంటే ఆ జాతి భవిష్యత్ అంతబాగా వుంటుంది.
@ తెలియనిది అడిగితే అజ్ఞానం కొద్ది సేపే. అడగక పోతే జీవితాంతం అజ్ఞానమే.మార్టిన్ లూధర్ కింగ్
సూక్తులు విజ్ఞానం -1సేకరణ- పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి