గురువే దైవం:-గోపమ్మ,10 వ‌,.తరగతి,దుప్పల్లి.

 మంచిమాటలతో మమ్ముల చేరదీసి
మా బతుకొక జ్ఞానరేఖ గీసి
జీవితాన్నంతా నందనవనంచేసే గురువుకెపుడు సదా వందనం
వారు మా ఎదలో నిండిన దేవుళ్ళు
నాలుగుగోడల్లో ఎన్నో మా ముందుంచి 
ప్రపంచం ముందు మమ్ముల గెలిపిస్తారు
వారి మాటలు మా బతుకు బాటలు
గరువుల లాలనలో పెరిగిన కుసుమాలం
జగతినంతా పరిమళం వెదజల్లే పరిమళాలుగా
తీర్చిన గురువుకు వందనం.

కామెంట్‌లు