డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్పోకు కాళోజీ సాహితీ పురస్కారం 2021

 సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో  కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మాతృభాషా దినోత్సవం గా జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా  కవితా పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కథా/ వ్యాస  రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ పోటీలలో పాల్గొని  ( కాళోజీ సాహితీ పురస్కారం 2021 )   అందుకున్నారు. సంస్థ అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత మాట్లాడుతూ డాక్టర్ చిటికెన  అద్భుతమైన కవితను అందించారని సాహిత్యరంగంలో సామాజిక అంశాలతో వివిధ వార్తాపత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు, సమీక్షలు రాస్తూ సమాజాన్ని చైతన్య పరుస్తూ ప్రతిభను చూపించినందుకు అభినందిస్తూ కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందించామని తెలియజేశారు. కార్యక్రమనిర్వహణలో ఏనుగు నరసింహారెడ్డి అడిషనల్ కలెక్టర్ మేడ్చల్ ( తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు ), కోఆర్డినేటర్ యామిని కొల్లూరు, కోశాధికారి పి. సాయి తరుణ్ పాల్గొన్నారు. పురస్కారం అందుకున్నందుకు పలువురు సాహితీవేత్తలు, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు-రావుల రాజేశం, కామిడి సతీష్ రెడ్డి లు డా చిటికెన ను అభినందించారు.

కామెంట్‌లు