ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999
సిన్నప్పటి ముచ్చట్లు
యాది కత్తె ఒగో సారి నవ్వత్తది.
సిన్న తనంల
గీ ఆన కాలంల 
కొంచెం ఎండచ్చి
సినుకులు వడితే
కాకి లగ్గం అయితుందని  
అనేటోల్లం
గట్లనే
ఎండ గొడుతూ, 
ఆన సినికులు పడ్డప్పుడు  
తెప్పెలల్ల  రంగు రంగుల్ల సింగిడి పొడిసేది
దాన్ని జూత్తే మత్తు సంబురం అయ్యేది
ఇగ
ఏదన్నా తినేటప్పుడు
ఎవరన్నా పోరగాండ్లు దగ్గరికచ్చి" నాగ్గూడ కొంచెం
పెట్టవా" అని అడిగితే
అంగి కొనకు తినేది పెట్టి
కొరికిచ్చి కాకి ఎంగిలి అని ఇచ్చేటోల్లం.
మాపటి జాములకు
కొంగలు మొగులు మీద నుంచి పోతుంటే
" కొంగా కొంగా గోరెయ్యి
దేవునింట్ల పైసేత్తా"
అని రెండు సేతులను
గిర్ర గిర్ర తిప్పి సేతి
గోళ్ళను సూసుకునేటోల్లం
గోళ్ళ మీద తెల్లని గీట్లు కనిపిత్తే కొంగలు గోరేసినయాని 
సంబుర పడేటోల్లం
సిన్నప్పుడు 
సేసిన పనులు,శాస్టలు 
మతిల కత్తే మనసు చెంచల్లమైతది.
గప్పటి సోపతులు
ఆటలు,తిండి గిప్పుడు ఎక్కడివి?
ఎనుకటి దినాలే మంచిగుండే
ఔ మల్ల!

కామెంట్‌లు