"ఒక్క అడుగు మంచి వైపు"(మినీ కథ 9):-పాత్లావట్ పురందాస్--9వ తరగతిZphs నేరళ్లపల్లి7013264464

  ఒక ఊరిలో విక్రమ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఎప్పుడూ జంతువులను హింసించేవాడు. పెద్దలను గౌరవించే వాడు కాదు. తన మెదడులో చెడు అలవాటు అనే విత్తనం నాటుకుపోయింది. గురువులు చెప్పే మంచి మాటలను మెదడులో ఎక్కించుకునే వాడు కాదు. విక్రమ్ ఎప్పుడు అల్లరిచేస్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులు ఎంత బుద్ధి చెప్పిన తను వినిపించుకునే వాడు కాదు. ఆఖరికి తను చెడు అలవాట్లకు బానిసై పోయాడు.తన చెడు అలవాట్లను చూసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. ఈ విషయాన్ని విక్రమ్ బడి గురువులకు తెలియజేశారు. అప్పుడు విక్రమ్ గురువు ఒక ఉపాయం ఆలోచించారు. అది ఏమిటంటే విక్రమ్ అని పిలిచి తను ఒక రోజంతా కొన్ని మంచి పనులు చేయి అని చెప్పాలనుకున్నారు. వారు అనుకున్న విధంగానే విక్రమ్ ని పిలిచి నీవు ఒక రోజంతా కొన్ని మంచిపనులు చేయి అని చెప్పారు. 
    విక్రమ్ సరే అని మరుసటి రోజు ఒక కుక్క తన కాలి మీద గాయమయ్యి బాధపడుతుంది. ఆ కుక్కను చూసిన విక్రమ్  వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కట్టు కట్టాడు. విక్రమ్ ఎంతో సంతోషించి అలా ఊరిలో తిరిగి వద్దామని బయలుదేరాడు. ఒక చోట ఒక ముసలావిడ దాహంతో ఏడుస్తుంది. తనకు నడవడానికి కూడా చాతనవ్వటంలేదు. విక్రమ్ తనను చూసి ఒక చెంబులో నీళ్ళను తెచ్చి ఆ ముసలావిడ ఇచ్చాడు. ఆ ముసలావిడ ఆ నీళ్లను తాగి ఇలా అన్నది. బాబు దాహంతో విలవిలలాడుతున్న నన్ను నీళ్ళు ఇచ్చి కాపాడావు. నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు బతుకు అని దీవించింది. విక్రమ్ కు అప్పుడు అర్థమైంది మంచి పనులు చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని. ఇంకా మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని. అలా విక్రమ్ ఎప్పుడు మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. తనను మారడం చూసి తన తల్లిదండ్రులు మరియు తన గురువులు ఎంతో సంతోషించారు.
నీతి: మనం ఎప్పుడూ మంచే ఆలోచించాలి. చెడు వైపు కన్నెత్తి కూడా చూడద్దు.

కామెంట్‌లు