సమస్యా పూరణలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 *కనులు మూసియున్న కాంచ గలము*
ఆ.వె
చెంచలంబు లేక శ్రద్ధగా దైవాన్ని
మనసు నందు నిల్పి మౌన ముగను
భక్తి తోడ తలువ భగవంతునెప్పుడు
*కనులు మూసియున్న కాంచగలము* 
 సమస్య పూరణ
*పదుగురైరి కవులు పద్మనాభ*
ఆ.వె
ఛందమనిన జరుగుచందరు వచనంబు
నెంచి వ్రాయమ్రోగె కంచు వోలె
పుత్తడైన పద్య పూత చెరిగిపోయి
*పదుగురైరి కవులు పద్మనాభ*
క.
పరికించగ దైవము వలె
*మురిపెముతో విద్యలన్ని ముద్దుగ నేర్పున్*
తరువుకు మిన్నైన గుణము
గురు శిష్యుల బంధమునకు గుర్తులు మనసా!
సమస్య పూరణ:-
*గురువు శిష్య సంబంధము మరుపు రాదు*
తే.గీ
నైతిక విలువలను జెప్పి నడక నేర్పు
గౌరవాచారములు నేర్పి ఘనత పెంచు
తల్లిదండ్రులకు సమమై దయను జూపు
*గురువు శిష్యసంబంధము మరుపురాదు*


కామెంట్‌లు
శ్యామ్. పి చెప్పారు…
మన తెలుగులో కొన్ని పదాలు వింటూ ఉంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మన తెలుగుకు మాత్రమే ఉన్న అదృష్టం పద్యం.