కొంచెమెత్తు తగ్గ కుంచిల్లగా బోకు
ఛత్రపతియు, శాస్త్రి, చాలా పొట్టి
అరయ వీరుడౌ నెపోలియన్ అంతేను
పొడుగు కాదు చేయు పనులు లెక్క.
బూర్జువాల పీడ బూడిదై పోవగా
విప్లవంపు శంఖు వూదినట్టి
మార్క్స్, లెనిను, మావో మామూలు మనుషులే !
చేయలేనిదేది చేవయున్న.
పొద్దు గుంకనట్టి ఆంగ్లసామ్రాజ్యమున్
హింసలేక సత్యహితము గానె
ఎదురు నిలిచి గెలిచె గాంధి మహాత్ముండు
శాంతి తోడ చాల చేయ గలము.
అమెరికాకు తాను అధ్యక్షుడాయెను
అంటరాని తనము నణగ దొక్కె
నిగ్రహంబు తోడ నిరుపేద లింకను
పట్టుదలగ జేయ పనులు కావె?
వెలికి నెట్టబడిన కులము నందున బుట్టి
చదువు బాగ చదివి చట్టమెరిగి
రాజ్య అంగములనె వ్రాసె నంబేద్కరు
ఎదనిండ కసి యుండ కానిదేది?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి