-ఎంత దేవుడైనా ఇప్పడు కనపడడు, కనబడితే అతను మానవుడు. జిల్లెళ్లమూడి అమ్మ
-ఓంకారపు విస్తృతరూపమే అమ్మ. అంబ అంటేనే అమ్మ.
-చెక్కకపోతే దిమ్మ , చెక్కితే బొమ్మ , గుళ్ళో వుంటే అమ్మ.
-తడబడుతూ పడే తొలి అడుగులో, పయనిస్తూ సాగే ప్రతిఅడుగులో, ఆరాటపడుతూ అనుబంధం పెంచే ఆ బంధం పేరే అమ్మ.
-తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది.
-దేవుడు కల్పించిన కమ్మని బంధం అమ్మ.
-ధరణికంటె ఎక్కువ భారాన్ని మోసేది అమ్మ.
-నేను కింద పడితే దెబ్బ తగిలి అమ్మా’ అని ఏడ్చినప్పుడు పరుగెత్తుకుంటూ వచ్చి తన గుండెలకు పొదుపుకున్న దెవరు? ఆ దెబ్బపై -ముద్దు పెట్టి నొప్పిని తీసేసిందెవరు? చక్కని కథ చెప్పి, జోల పాట పాడి నిద్ర పుచ్చిందెవరు? అమ్మ. అమ్మ, అమ్మ . ఎన్. టేలర్
-ప్రాణం పోయే స్థితిలో మరొక ప్రాణికి జన్మనిచ్చే దేవత అమ్మ.
-ప్రేమకు అర్థం వెతుకుతున్నావా? చూడాల్సింది నిఘంటువు కాదు అమ్మ ముఖం. నేతల ప్రతాప్ కుమార్
-సృష్టిలోని తీయని పదం అమ్మ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి