సూక్తులు. విషయం- అవకాశాలుసేకరణ- పెద్ది సాంబశివరావు, 94410 65414, peddissrgnt@gmail.com

 @ ఆరోగ్యవృద్ధి లేదా ధనవృద్ధి కలిగినప్పుడు ప్రతివానికి అహంకారం పెరిగి తప్పుదోవ తొక్కే అవకాశం ఉంది.  మహాభారతం
@ఆశావాదికి ఆపదలో కూడా ఆశ, నిరాశావాదికి గొప్ప అవకాశంలో కూడా ఆపద కనిపిస్తాయి. కాంప్‌బెల్
@ఆసక్తి ఉంటే అవకాశాలు చాలా కనబడతాయి. వాటిలో అనేకం ఫలిస్తాయి.  హెన్రీ. ఎన్.హస్కన్స్
@ఉన్న అవకాశాన్ని వినియోగించుకోలేని వారికి ఎన్ని అవకాశాలు వచ్చినా నిష్ర్పయోజనం.
@ఎలాంటి కష్టాలనైనా అవకాశం చిగురింపజేస్తుంది.  ఫ్రాంక్లిన్
@కలలే నిజమైతే నిజాలు కలలయ్యే అవకాశం ఉంది.   సర్వేపల్లి రాధాకృష్ణ
@జీవితం ఒక  అవకాశం, దాని నుంచి ప్రయోజనం పొందు,  అది సౌందర్యం, దానిని అభిమానించు. అదొక కల, దానిని వాస్తవం చేయి. @అదొక సవాల్ అయితే దానిని ఎదుర్కో.  అది ఒక కర్తవ్యం, దానిని నెరవేర్చు. అది ఒక ఆట అయితే దానిని ఆడు. అది వాగ్దానం అయితే దానిని నెరవేర్చు.  అది విషాదమా, దానిని అధిగమించు. అది ఒక పాట అయితే దానిని పాడు. అది పోరాటమా, అయితే ఆమోదించు, @అది విషాదమా దానిని ఢీకొట్టు.  అది ఒక అదృష్టం, దానిని అందుకో.
@నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది.   ఆల్బర్ట్ ఐన్ స్టీన్
@ప్రతి మనిషి జీవితంలో ఎల్లప్పుడూ కొన్ని అవకాశాలు వస్తుంటాయి.  వాటిని గుర్తించగలిగితే అభివృద్ధిని పొందుతాడు.
@ఓ పాఠశాల ప్రారంభించామంటే, ఓ చెరసాలను మూసివేసే అవకాశం కల్పించినట్లు. విక్టర్ హ్యూగో
@విజ్ఞానశాస్త్రానికి రాచబాట అంటూ లేదు. నిటారుగా వున్న దాని మార్గాలను ఎగబ్రాకటంలో శ్రమకి భయపడని వాళ్ళకే  దాని శిఖరాలను చేరే అవకాశం వుంది.


కామెంట్‌లు