యనుచు ఫోనుచేయ వీలు కల్గ
జేసినాడు వేత్త మైఖేలు ఫారడే
దీక్ష కలిగి చేయ కాంక్ష తీరు.
ఎంత కోపపడిన కొంతైన మారవు
వాన. ఎండ, కరువు వగయిరాలు
వాటి బారి పడక తొలగుట నేర్చుకో
చేతకాని యెడల బాధ మాను.
భావమెరుగలేని బండ చదువులేల
సత్యదృష్టిలేని రాతలేల
చిత్తశుద్ధిలేని చెత్త మాటలు ఏల?
జీవి లేని వట్టి దేహమటుల.
ఆశలుడిగినంత ఆనందమేముండు?
పెక్కు ఆశలుండి ఫలము లేదు.
మంచి ఆశయాల కొన్ని ఎంచుకొనుము
వాని చేరువరకు పాటు పడుము.
మంచి జరిగినపుడు మన గొప్ప యందుము
అన్ని తెలిసె ననెడు అహము తోడ
పనులు కాని యెడల పరులను నిందించ
ఎన్నడైన తగదు ఎరుగుమయ్య.
మంచి సూక్తులను అందించారు శ్రీ పెద్ది సాంబశివరావు!
అభినందనలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి