శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు-94410 65414, peddissrgnt@gmail.com

తడిసినట్టి చెత్త తడవని చెత్తలు
వేరు చేసి చేర్చు వీధి కుండీ
ఇరుగు పొరుగు నెపుడు ఇబ్బంది పెట్టకు
పురము శుచిగ యుండు పౌరులార.

అధిక రాయితీలు అదిరెడు డిస్కౌంట్లు
రోజు కొక్క బోర్డు రోత పుట్ట
ఆను లైను లోన ఆఫర్లు వలతాళ్లు
ఉచిత కాన్క లగును ఉరులతాళ్లు.

వేగ కొనుడు ఒకటి, వేసుకొ నుడయిదు
ఆదివారమంత ఆఫరుండు
ఇంటి కడకె దెచ్చి ఇచ్చెద మమ్మలూ
వాయిదాల జమల వీలు కలదు.

లేదు తరుగు, మరియు లేదు మజూరియు
పాత, కొత్త నగల మార్పు కలదు
రకము చూచి కొనుడు రత్నాలు, వజ్రాలు
తారలంత సాక్షి తరలి రండు.

మగ్గముల ధరలకు మేమమ్ము చున్నాము
కంచి, ధర్మవరము, పోచము పల్లియు
ఉర్రయూరు, సూరతు ప్పాడ, రకములు
కలవు మంగళగిరియు కారు చౌక.









కామెంట్‌లు