భాషమీద పట్టులేక తెలుగంటే లెక్కలేక
అంతులేని అత్యుత్సాహం అహంభావం
తెలుగువార్తకు ఈమధ్యదక్కిన దౌర్భాగ్యం ,
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము..!!
పాత్రికేయ రంగమది పవిత్రమని భావించి
ప్రజలలోనికి పోవు అక్షరతూణీరమని ఎంచి ,
పదప్రయోగము పట్ల అప్రమత్తమవసరములే
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము...!!
మాతృభాషమీద మమకారము సడలిపోయే
అన్యభాషలపట్ల జనావళికి ఆసక్తి మెండాయె
ఎన్నిభాషలునేర్చినాతల్లిభాష తరువాతనే కదా
వినుము కెఎల్వీ మాట నిజముసుమ్ము ...!!
తప్పుచేయుట అన్నది మానవసహజమే లే
తెలియక చేసిన'తప్పు' తప్పుకాబోదు జగాన,
తప్పును తెలుసుకుని ఒప్పుకొనువాడుధన్యుడు
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము....!!
పద వుచ్ఛారణయేభాషకందముదెచ్చు కదా
అర్ధము తెలియని పదమును ప్రయోగించబోకుమా
సాహిత్యమునకే వన్నెతెచ్చు పదములు ఎంచుమా
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి