గణపతి దేవా-యన్.భాస్కర్--9వ తరగతి ,ఈ/యం.జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా

గణపతి దేవా రావయ్యా
ఘనముగ పూజలు నీకయ్యా
భక్తితో నిన్ను వేడెదము
పూలు పండ్లు తెచ్చెదము
పూజలు బాగా చేసెదము
కుడుములు ఉండ్రాళ్ళు నీకు ఇష్టం
కుదురుగా నీవుకూర్చోవయ్య
బొజ్జ నిండా బోంచేయవయ్య
ఎలుక వాహన గణపయ్య
ముందు పూజలు నీ కేనయ్య
అమ్మ నాన్నలను సేవించి
ఆది దేవుడవు అయ్యావు
అన్ని విద్యలకు నీవే మూలం
అందుకొనుము మా వందనం

కామెంట్‌లు