జీవహింస చేయరాదు. తాటి కోల పద్మావతి గుంటూరు.


  అది ఒక చిన్న పల్లెటూరు అక్కడ అందరూ ప్రతి ఇంట్లో ఆవుల్ని గేదెల్ని పెంచుతూ ఉంటారు సరోజ వాళ్ళింట్లో నాలుగు ఉన్నాయి . ఈ రోజు వాటికి సమయానికి మేత పెట్టడం కుడితి నీరు తాగించడం ఎప్పటికప్పుడు గోశాలను శుభ్రం చేస్తుంటారు ఉదయం సాయంత్రం పాలు పితుకుతారు. పాలు తీసే సమయంలో శ్యామ్ అక్కడికి వచ్చి ఆవుని కర్రతో కొట్టబోయాడు. అంత లోనే వాళ్ళ నాన్న వచ్చి ఎందుకురా అలా నోరు లేని జంతువు ని కర్రలతో కొట్టకూడదు అవి మనకు పాలను ఇస్తున్నాయి సమృద్ధిగా వాడుకుంటున్నాం. ఆవు గోమాత ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నాడు. ఏమన్నాడు చరణు స్కూలు నుంచి వస్తూ తూ నీ కళ్ళ ని పట్టుకొని ఆడుతున్నాడు. అది వాళ్ళ మాస్టారు చూసి కో పడ్డారు. తూనీగ లకు దారం కట్టి గాలిలో ఎగరేసి ఉంటే పాపం అవి గిలగిలా కొట్టుకుంటున్న వి. మాస్టారు వాడిని దగ్గరకు పిలిచి నువ్వు చేస్తున్న పని చాలా తప్పు అవి నిన్ను ఏం చేశాయి వాటిని హింసిస్తున్న వు. నీకు కాళ్ళు చేతులు కట్టి వేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు తూనీగలు ఓంకారం చేసుకుంటూ ఎగురుతూ ఉంటే ఒక ఆనందాన్ని అనుభవించాలి అంతేకానీ వాటిని దారం కట్టి వేయకూడదు. సీతాకోక చిలుకలు కూడా పట్టుకొని రెక్కలు విరిచి వేస్తారు అది కూడా మహా పాపం. అవి గాలిలో స్వేచ్ఛగా ఎగురుతాయి. పక్షులు, చిలకల్ని పట్టి బంధించి కూడదు అవి కూడా స్వేచ్ఛగా ఎగిరే జంతువులే. జీవహింస చేయరాదు చీమల్ని చంపరాదు మూగ జీవులు హింసించ కూడదు. కుక్కలను ప్రేమతో పెంచుకోవాలి. అలాగే ఇతర జంతువులను కూడా ప్రేమతో పెంచుకోవాలి. దయ కారుణ్య భావం కలిగి ఉండాలి అంటూ మాస్టారు చెప్పిన మాటలు చెవికి ఎక్కించుకున్నాడుచరణు. అప్పటి నుంచి తూనీగల ని పట్టుకొని ఎగర వేయడం మానివేశాడు శ్యాము కూడా ఆవుల జోలికి వెళ్లడం లేదు వాటకి వేయడం దూడల తో ఆడుకోవడం చేస్తున్నాడు. వాళ్ల స్నేహితులకు కూడా ఇదే విషయాలు చెప్పాడు తోటి పిల్లలతో తను నేర్చుకున్న మంచి విషయాలను చెప్పటంతో ఆకతాయి పిల్లలు కూడా జీవ హింస చేయకూడదని నేర్చుకున్నారు. వాళ్ళింట్లో పెరుగుతున్నా కుక్కపిల్లలు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఎక్కడైనా నా కుక్క పిల్లలు గాని పిల్లి పిల్లలు గానీ కనిపిస్తే వాటిని తీసుకొచ్చి భద్రమైన చోటికి చేర్చుతారు. పెద్దవాడైన తరువాత కూడా జీవహింస చేయకూడదు అని పెద్దలు చెప్పిన వాక్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు.


కామెంట్‌లు