సంప్రదాయ కళలు. శిల్పకళ.: -తాటి కోల పద్మావతి గుంటూరు.

 చిన్నతనం నుండి పిల్లలకి బొమ్మలు తయారుచేయడం నేర్పిస్తారు. గొబ్బెమ్మలతో మొదలుపెట్టి భీముని బొమ్మలు, వినాయకుని బొమ్మలు పిల్లల చేత చేయిస్తారు. మనవారు శిల్పకళలో బాలబాలికలకు ఈ విధంగా శిక్షణ ఇచ్చేవారు. బొమ్మల పెళ్లిళ్లు చేయించడం ఇందుకే. మన సంస్కృతిలో శిల్పకళ దేవాలయాన్ని ఆశ్రయించి ఉంటుంది. బంకమట్టి లోహం, శిల వీటితో విగ్రహాలు తయారుచేయడం, వాటికి పూజలు చేయడం మన సంప్రదాయంలో ఉంది. ఈ విగ్రహాలను తయారు చేసేవారు గొప్ప శిల్పకళా వేత్తలు. ఇంతే కాదు ఆలయ నిర్మాణమే ఒక పెద్ద వాస్తు కళ విశేషం. చుట్టూ ప్రాకారాలు, గోపురాలు
 మహా ద్వారాలు పల్లకీలు రధాలు మొదలైనవి వాటిపై గంధర్వ యక్ష కిన్నెరా దుల మూర్తులు, దేవతల వాహనాలు, ఉత్సవాలకు పల్లకీలు రధాలు మొదలైనవి నిర్మించడంలో అంతా శిల్పమే కనిపిస్తుంది. గొప్ప ఊహాశక్తి సృజనాత్మకత, పౌరాణిక శాస్త్రాల పరిజ్ఞానం, సుదీర్ఘమైన తపోదీక్ష కలిగిన శిల్పులు ఆలయాలను, ఆలయ శిల్పాలను సృష్టించారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కళలో శిల్ప కళ కూడా చాలా ముఖ్యమైనది. గుడి గోపురాల మీద శిల్ప కళలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వినోదం కలిగిస్తాయి. శిల్ప కళ పట్ల ఆసక్తి చూపించడం మన కర్తవ్యం.

కామెంట్‌లు