కలికాలం కళ్ళారా చూడు
వింత రోగం విజృంభన చూడు
పేదవాడి బ్రతుకులు చూడు
ఉన్నవాడి దర్పము చూడు
:: కలికాలం::
పెరుగుతున్న ధరలను చూడు
తగ్గుతున్న ధర్మాన్ని చూడు
ప్రకృతి ప్రకోపము చూడు
అరణ్యాల ఆక్రందన చూడు
:: కలికాలం ::
అబద్ధాల రాజ్యాన్ని చూడు
కట్టుబొట్టు మార్పులు చూడు
వరసలు మారిన తీరును చూడు
పీకు తినే రాబందులు చూడు
:: కలికాలం :::
బ్రతుకులోన బరువులు చూడు
మనసులోన మలినము చూడు
నాలుక చేసే నాట్యము చూడు
నీడను నమ్మని కాలము చూడు
:: కలికాలం:::
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి