*తత్వసారము* *(మణిపూసలు)*:-*మిట్టపల్లి పరశురాములు

వట్టి చేత వస్తావు
వట్టిగనె పోతావు
భోగములనెన్నొజేసి
మట్టిలో కలుస్తావు 

నావినావంటావు 
గర్వపడుతుంటావు
ఎన్ని సంపాదించిన
ఏవిని వెంట రావు

పదవిలో ఉంటావు 
మోసాలు చేస్తావు
జనముబాగుచేయకనె
బెదరగొడుతుంటావు

మేడమిద్దెలుఉన్న
బంగారు నగలున్న
కోట్లుగడించినగాని 
సర్వమంతయుసున్న

కాళికరమునవస్తావు
కాళిగనెపోతావు 
ధనముచేగర్వించ
పతనమైపోతావు

ధనముకూడబెట్టిన
పదవులెన్నొజేసిన
వెంటరావుమానవా!
ప్రాణమెల్లిపోయిన

బంధుబలగమెంతయున్న
కోట్లకొలదిసంపదున్న
ఊపిరెల్లిపోయినాక
ఏదినీతొరాదురన్న
       *****
    

కామెంట్‌లు