బెర్లిన్ ఒలింపిక్సు...అచ్యుతుని రాజ్యశ్రీ


 ఒలింపిక్సు క్రీడలు జరుగుతున్నాయి కాబట్టి  ఈరోజు 1936లోజరిగిన ఒలింపిక్సు క్రీడల విశేషం తెలుసుకుందాం. ఎర్రటిబట్టపై నల్లని స్వస్తిక్ గుర్తున్న  జెండా  జర్మన్ నాజీపార్టీవారి గుర్తు.నాజీలకు మహా గర్వం అహంకారం ఏమంటే "ఈప్రపంచంలో ఉత్తమజాతివారం మేమే "అని.లక్షా10వేలమందికూచునే బెర్లిన్ ఒలింపిక్సు స్టేడియంలో జర్మన్లు అంటే తాము తప్ప ఎవరూగెలవరు అని అహంకారం తో అందరినీ చిన్న చూపు చూశారు.జర్మనీ లో ఉన్న యూదులను అనుక్షణం ద్వేషిస్తూ  హింసిస్తూ రాక్షసుల లాగా పీక్కు తిన్నారు. 52దేశాలు ఒలింపిక్సు లో పాల్గొన్నాయి.22ఏళ్ల  జెస్సీఒవెన్స్  అనే నీగ్రో క్రీడాకారుడు పరుగుల వీరుడు.లాంగ్ జంప్ లో ఉద్దండుడు. క్రీడలు ఆగస్ట్ ఒకటిన ప్రారంభం ఐనాయి.100మీటర్ల దూరం ని10.3సెకండ్స్ లో జెస్సీ పరుగెత్తేటప్పటికి నాజీనేత అడాల్ఫ్ హిట్లర్ కి కడుపు మండిపోయింది."ఒక నల్లజాతివాడికి  షేక్ హ్యాండ్ ఇవ్వను"అని  బుసలు కొట్టాడు. లాంగ్ జంప్ లో మొదట తడబడిన జెస్సీని  లట్జ్ లాంగ్ అనే  జర్మన్ లాంగ్ జంప్ క్రీడాకారుడు వెన్నుతట్టి ప్రోత్సహించాడు. అంతే ఆస్ఫూర్తితో  జెస్సీ 8.06మీటర్ల ని గెంతాడు.24ఏళ్లు  ఆరికార్డ్  స్థిరంగా ఉండిపోయింది. 3బంగారు పతకాలు పొందాడు. ఎవరు ఎన్ని మాటలతో హింసించినా 4వపతకం కూడా సాధించాడు.ఆబ్లాక్ అమెరికన్  అలా హిట్లర్ అహంకారాన్ని అణిచాడు. మనం కూడా ఎలాంటి అవమానాలు ఎదురుదెబ్బలు ఎదురైనా ధైర్యం గా ఎదుర్కొనాలి.నవ్విన నాపచేను పండుతుంది  అనే సామెత ఉంది. నిరాశతో కృంగిపోరాదు.


కామెంట్‌లు