ఒజ్జ -సాహితిసింధు సరళగున్నాల

కం*గురువులమ్రొక్కిన చాలును
గురువాజ్ఞలనందుకొనిన గురుతరముగనే
సరిదిద్దగజీవితములు
పరెగెత్తునుగెలుపుత్రోవ పదపద మనుచున్

కం*అజ్ఞానముబాపుటకై
సుజ్ఞానిగమారితాను సుధలొలికింపన్
విజ్ఞానమువెల్లువలై
ప్రజ్ఞానిగ వరలుచుండు పదపదమనుచున్

కం*తల్లిగలాలనపంచుతు
మెల్లిగతావిద్యనేర్పి మేధినియందున్
వెల్లువలాజ్ఞానసుధలు
చిల్లింపగనందుకొనిన చిరయశమందున్

కం*తప్పులు దెలుపుచునెప్పుడు
నొప్పులదారేదొజెప్పు నోర్పుననెపుడున్
మెప్పులనందగ బుద్ధిని
చొప్పించగమెదడునందు జోతలనిడుదున్

కం*అరకను బట్టుకదున్నగ
సరిజూపగనొకరుగురువు శ్రమయేదెలుపన్
తరిగనిసేధ్యముజేయగ
సిరిపెంచగగురువునొకరు శ్రేయమునింపున్

కం*వేదమ్మునుడువు వారలు
బేధమ్మునుజూడబోక వేడుకతోడన్
సాధింపగధర్మనిరతి
బోధనతోజ్ఞానజలధి పొంగించెదరే
కామెంట్‌లు
పెద్ది సాంబశివరావు చెప్పారు…
పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.