బాధల బాల్యం : వెల్లంకి వెంకట సత్యనారాయణరావు:-- సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 గురుకుల విద్యా లయాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి ప్రస్తుతం ప్రశాంతంగా భార్య తో జీవితం గడుపుతున్న శ్రీ సత్యనారాయణ రావు గారి  బాల్య స్మృతులు : 
-------------------------------------------------
: "నాపేరు వెల్లంకి వెంకట సత్యనారాయణరావు.బాల్యం అంతాబాధలు.ప్రైవేట్ గాబి.ఎ.  చదివి  బి.ఇడి  చేశాను. తెలుగు ఎం.ఎ.ఆపై సర్వేలు గురు కుల విద్యా లయంలో ప్రిన్సిపాల్  ఇంకా కిన్నెరసాని భద్రాచలం గిరిజన గురు కుల విద్యా లయంలో ప్రిన్సిపాల్ గా చేసి  రిటైరయ్యాను.నాబాల్యం తల్చుకుంటే  ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ అప్పుడు పడిన కష్టాలు  ఆపరమాత్మునికే ఎరుక. నేను 1940లో హేలాపురి(ఏలూరు)లో పుట్టి పెరిగాను.8వ ఏటనే నాన్న  చనిపోటంతో మాఅమ్మమ్మ  అమ్మ  అక్క అన్న నేను మిగిలాం.ఒక ఇల్లు తప్ప ఆస్తి పాస్తి మాకు నాస్తి.క్లర్క్ గా ఉన్న అన్న 1950లో జనగాం లోని మద్దూర్ హైస్కూల్ లో టీచర్ గా చేరాడు. అక్క పెళ్లి ఐంది.నేను  అమ్మ  అమ్మమ్మ మిగిలాం. నేను 5వక్లాస్ చదువు తున్నప్పుడు బడికి ఒక గారడీవాడు వచ్చాడు. సంచీలో కొన్ని ఆకులు వేసి  మంత్రం చదివి "నీకు ఏంకావాలి?"అని అడిగాడు. "లడ్డూ!"ఆశగా అన్నాను."సంచీలో ఉంది తీసుకో"అన్నాడు. అరె!నిజంగానే లడ్డూ నాచేతికి చిక్కింది. అది తొలి తీపి జ్ఞాపకం. ఒక రోజు నాస్నేహితునితో కలిసి ఏలూరు కాలువ కి వెళ్ళాము.నాకు ఈతరాదు.కానీ వాడి బలవంతంపై నీటిలోకి దిగి ఉక్కిరిబిక్కిరి అయ్యాను.మునిగి పోతున్న  నన్ను  బైటికి లాగాడు.ఆగండం గడిచిపోయింది.
: ఫ్రెండ్ తో రోజు వాకింగ్ కి వెళ్ళేవాడిని.ఒకరోజు కబుర్లలో పడి 10కి.మీ.నడిచాం.ఆకలి కాళ్లు బాగా గుంజుతున్నాయి.జేబులో చిల్లిగవ్వలేదు. ఒక జామకాయల అబ్బాయి  జాలి పడి ఇచ్చిన  కాయలు తిని చెరువులో నీరు తాగి ఎడ్లబండి వాడి దయతో మధ్యాహ్నం  రెండు కి ఇల్లు చేరాం.ఇంట్లో వారు  పోలీసు రిపోర్ట్ కెళ్ళ బోతుండగా ఇల్లు చేరాం.తిట్లు తిన్నాం. 1955లో అన్న దగ్గర ఉండి స్కూల్ చదువు ముగించి ఏలూరు వచ్చి టైప్ షార్ట్ హాండ్ ట్యూషన్ తో బతుకు బండి లాగించాను.ఎస్. జి.బి.టి.ట్రైనింగ్  వరంగల్  లోని వెల్చాలలో టీచర్ గా20కి.మీ.నడక ఎడ్లబండి  ప్ర యాణం రాత్రి గొడ్లపాక పగలు బడి హెచ్. ఎం.గాటీచర్ల జీతాలు తేవటం పంచటం వాగు పొంగితే పశులకాపరితో కలిసి   పీకలోతు నీటిలో నడవటం...ఇప్పుడు తల్చుకుంటే  ఆశ్చర్యం  అద్భుతంగా అనిపిస్తుంది. బాల్య స్మృతులు మధురంగా చిరుచేదుగా నాకు మిగిలాయి.

కామెంట్‌లు