డా.సదయ్యను అభినందించిన కరీంనగర్ జిల్లావిద్యాశాఖాధికారి


 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ మీటింగ్ తేది: 20-09-2021 న  జరిగింది.జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సిహెచ్ జనార్థనరావు గారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ మీటింగుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా రాష్ట్ర అసోషియేషన్ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలోని అందరు స్కౌట్ మాస్టర్లు మరియు గైడ్ కేప్టన్లు హాజరయ్యారు.స్కౌటింగ్ లో ఏడుగురు విద్యార్థులకు రాజ్యపురస్కార్ అవార్డులు రావడానికి కృషిచేసిన  జి.ప.ఉ.పా.వావిలాల గణితోపాధ్యాయుడు మరియు జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ అయిన శ్రీ అడిగొప్పుల సదయ్యను జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సిహెచ్ జనార్థనరావు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి డా.మంచాల వరలక్ష్మి గారలు ధ్రువపత్రాలు అందించి అభినందించారు. ఈసమావేశంలో జిల్లా ఛీప్ కమీషనర్ శ్రీ భగవంతరావు, జిల్లా కార్యదర్శి శ్రీ కె రాంరెడ్డి,జిల్లా శిక్షణా కమీషనర్ శ్రీ షరీఫ్ అహ్మద్, జిల్లా కమీషనర్లు శ్రీ జి లక్ష్మీ నారాయణ, మల్లేశం,పద్మజ,ఇందిర,లావణ్య,శ్రావణ్, రవికుమార్, గణేష్ సింగ్ మొదలగు పాల్గొన్నారు.


కామెంట్‌లు