ఒకరోజు రాజుగారు ఉద్యానవనంలో లో తిరుగుతున్నప్పుడు మనమిచ్చే జీతాలు సేవకులకు చాలడం లేదట వారు పెంచమని కోరుతున్నారు అంటూ తెలిపాడు మంత్రి.
అది విన్న రాజు కోపంతో సేవకులకు రాజు కన్నా ధనమే గొప్పదా అన్నాడు. వారు ప్రస్తుతం తీసుకుంటున్న జీతాలతో వారి కుటుంబ పోషణ కష్టంగా ఉండటం వల్లనే ఎక్కువ డబ్బు కావాలని అడుగుతున్నారని బదులిచ్చాడు మంత్రి. వెంటనే రాదు ప్రయోగాత్మకంగా మూడు నెలలపాటు జీతాలు లేకుండా పని చేయమని సేవకులను ఆ దేశం చేయండి. అప్పుడు వారికి రాజు మీద ఉన్న గౌరవం ఎలాంటిదో తెలుస్తుంది అన్నారు. మొదటి నెలలో వారం రోజులు భయం భక్తితో వచ్చిన సేవకులు కొద్దిమంది కడుపు నొప్పి, కాలు నొప్పి కళ్ళు నొప్పి అనే ఇలా సాకులు చెప్పి వరుసగా పనికి రావటం మానుకున్నారు. రెండవ నెలలో మరి కొద్ది మంది సేవకులు ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగా లేదని ఇంకొంతమంది సేద్యం పనులు చేసుకోవాలని మానివేశారు. మూడవ నెల వచ్చేసరికి ఏదో ఒక సాకు చెప్పి అందరూ నిలిచిపోయే ప్రమాదం పసిగట్టిన మంత్రి వెంటనే రాజును కలిశాడు.
మనం సేవకులను మన ఇంటి మనుషులుగా చూసుకున్నాము కదా మూడు నెలల జీతాలు ఇవ్వమంటే నే పనికి రావడం మానుకున్నారు. అంటే రాజు అంటే భయం భక్తి లేకుండా పోయింది. రాజమందిరంలో పని చేస్తున్నామంటే నే గొప్ప విషయం కదా అన్నాడు రాజు.
రాజా రాజు కన్నా ధనమే కదా అన్నిటికి మూలం సేవకులు డబ్బు కోసమే పని చేస్తారు. ఎందుకంటే డబ్బుతోనే వారి కనీస అవసరాలు తీరుతాయి వారికి రాజమందిరం లో పనిచేయటం గర్వకారణమే కావచ్చు. ఆదాయం లేక పోతే వారికి వారి కుటుంబానికి తిండి గుడ్డ ఎలా గడిచిపోతాయి అని మంత్రి తెలియపరిచాడు.
మరి వాళ్ళకి రాజు పైన గౌరవం ఎలా ఉన్నట్లు అని రాదు ప్రశ్నించాడు.
మహారాజా గౌరవం అనేది మీకోసం ప్రాణాలైనా ఇవ్వగలరు వారికి మీ పట్ల భయం భక్తి లేక కాదు. కానీ నీ అవేవి వాళ్లకు కూడా పెట్టావు కదా ఎవరైనా కనీస అవసరాలు తీరిన తరువాత ఇతర విషయాలు ఆలోచిస్తారు. అందువల్ల వారు పనులకు నిలిచి పోవడాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. నిజం చెప్పాలంటే నేరం వాళ్ళది కాదు. వాళ్ల ఆకలిది. మన డబ్బు తిన్న వాళ్ళు నీతి నిజాయితీగా పని చేయడాన్ని మనం గుర్తించాలి ఆకలిగొన్న వానికి అన్నం పెట్టాలి కదా. ఈ విషయం నీకు తెలియనిది కాదు అని వివరించాడు మంత్రి.
ఎవరైనా స్వధర్మం మానుకొని పరధర్మం చేయలేదు కదా అన్న విషయం అర్థం చేసుకున్న రాదు వెంటనే సేవకులు అందరిని పనిలోకి పిలిచి వారికి రెండింతలు జీతాలు పెంచడంతో వాళ్లంతా ఉత్సాహంగా పని చేయసాగారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి