శ్రీపార్వతీనందనా శాంభవీ మాత
పుత్రుండ దేవాది దేవుండ విఘ్నేశ
నీదివ్య రూపంబునీ బొజ్జ వీక్షించ
లంబోధరా రామహాకాయమే నీది
నీశూర్ప కర్ణంబులన్ జూడ నీబుద్ధి
సూక్ష్మంబు నీ దృష్టిమాపైన సారించు
ఓ ఏక దంతుండ నీవక్ర తుండంబు
నీమోము నీకళ్లు నీమంద హాసంబు
నీయండ మాకుండ మాకింక లోటేది
నీభవ్య రూపంబు దర్శించి హర్షించి
మందార గన్నేరు చేమంతి పూబంతి
మారేడు నేరేడు ముప్పైగ పత్రీల
పుష్పాల పూజించిశ్రీగంధమున్ బెట్టి
మీకిష్టమైనట్టి వుండ్రాళ్ల నర్పించి
దూపంబులన్ వేసి దీపంబు వెల్గించి
యక్షింతలన్ వేసి టెంకాయ గొట్టేము
విఘ్నేశ్వరా మిమ్ము వేడేము నీలాప
నిందల్ని బాపేటి ముక్తీశ మాయాప
దల్ బాప రావయ్య ఏ పూజ నందైన
నీపూజముందే గణాలందు నాధ్యుండ
వేనీవు ఓ సుందరాకార
ఓదేవ చూడామణీ లోక రక్షామణీదేవ
శ్రీశూలి పుత్రుండ ఓంకార మంత్రుండ
నీకన్న మాకెవ్వరున్నారు మమ్మేలు
నీముందు నిల్చేముకర్ణంబులన్ బట్టి
గుంజీలు దీసేమునాలోని జాడ్యంబు
ద్రుంచేయు నీపూజ నీనామ
మేనాకు నిత్యంబు నేగొల్వ నాభాగ్య
మున్ నెంచి ప్రార్థింతుభక్తాళికిన్ కొంగు
బంగారమై కంటికిన్ రెప్పవై యేలు
నీయందెలున్ మ్రోగ నీదాస దాసుల్ని
రక్షించ రావయ్య విఘ్నేశనీవే గ
ణేశానమస్తే నమస్తే నమః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి