దేవుడంటే ...ఇలా ..!! > రచయిత --శ్యామ్ కుమార్ .చాగల్ >నిజామాబాద్ *
 మనుషుల్లో దేవుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అతి సాధారణ వ్యక్తి లాగా కనిపించే కొందరు మన జీవితంలో అతి ముఖ్యమైన సహాయం చేసి  తిరిగి మన నుంచి యేమీ ఆశించకుండా  మన వైపు కనీసం తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
 ఎన్నో కష్టాలకు ఓర్చి డిగ్రీ పూర్తి చేసిన నేను ఉద్యోగాన్వేషణలో పూర్తిగా నిమగ్నమయ్యాను. 
 ఆ సమయంలో నాకు కాంపిటీటివ్ సక్సెస్ రివ్యూ  అనబడే  మ్యాగజైన్ ఒకటి ఉందని  దాన్ని కూడా చదవ మనీ , హిందూ పేపర్  కూడా  ప్రతి రోజూ  చదవమని ఒక మిత్రుడు రాధాకృష్ణ  చెప్పాడు. అతను  ప్రస్తుతం  కెనడా లో సెటిల్ అయ్యాడు.
 జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు జనరల్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ టెస్ట్ పుస్తకాలు, రెన్ అండ్ మార్టిన్  పుస్తకాలు చదువుతూ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నాను.  ఇటువంటి వాటికి తగిన సౌకర్యాలు కానీ విస్తృతమైన పుస్తకాలు కానీ లేదా ఇటువంటి సాధన లో నిమగ్నమైన స్నేహితుల తోడుగానీ  మా ఊరు నిజాంబాద్ లో నాకు లేకుండా పోయింది.  ఇవి సాధించడానికి హైదరాబాద్ రమ్మని, అక్కడకు వచ్చి రీజినల్ లైబ్రరీలో సమయం పూర్తిగా వెచ్చించితే కానీ  మంచి ఉద్యోగాలు రావని కరుణాకర్  మరో  కొందరు స్నేహితులు సలహా ఇచ్చారు.  అది నా తాహతుకు మించిన పని అని తెలిసినా కూడా,! అప్పటి నుండి 
 హైదరాబాదులో ఉండడం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాను.
 అప్పట్లో మా నాన్నగారి స్నేహితులు శ్రీ బెస్త బాలయ్య గారు , కామారెడ్డి ఎమ్మెల్యే  గా ఉన్నారు.  ఆయన నిజామాబాద్ కు వచ్చినప్పుడు మా ఇంటికి స్నేహపూర్వకంగా విచ్చేశారు . 
  నేను బయట నుండి ఇంటికి వెళ్లేసరికి భోజనాలు  చేసి  శ్రీ బాలయ్య గారు,  మా అమ్మనాన్న గార్లతో రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు.
 నేను ఆయనను చూసి "నమస్కారం అండి "అని రెండు చేతులతో దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయాను.
 కాసేపటి తర్వాత నన్ను పిలిచి" ఏం చేస్తున్నావ్ బాబు ? "అని వాకబు చేశారు. అప్పుడు నేను హైదరాబాద్ రావటానికి ప్రయత్నిస్తున్న విషయం చెప్పాను.
 దానికి ఆయన కాసేపు ఆలోచించి
 " నేను హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్నాను. ప్రస్తుతం  అందులో నేను నా పెద్దబ్బాయి మాత్రమే ఉంటున్నాం .అందులో ఎన్నో గదులు ఉన్నాయి. అన్నీ ఖాళీ గా వున్నాయి.  మా అబ్బాయి ఎం బి బి ఎస్  ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.  నువ్వు వచ్చి మా ఇంట్లో  వెనకాతల ఉన్న గదిలో  ఉండవచ్చు.  నీకు వీలు చూసుకొని వచ్చెయ్యి" అంటూ చెప్పారు. 
 దానికి మా ఇంట్లో అందరూ ఎంతో సంతోషించి నన్ను హైదరాబాద్  కు పంపించడం జరిగింది.
 బస్సు ఎక్కి చేతిలో ఒక బ్యాగు,  ఇంకొక పెద్ద పెట్టెలో వంటకు కావలసిన సామానులు అన్ని తీసుకొని  హైదరాబాద్ వెళ్లాను.  బస్ డిపో లో దిగి ఆ బరువైన సామాన్లు మోసుకుంటూ సిటీ బస్సు ఎక్కి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర దిగాను.
 ముందే బాలయ్య గారి క్వార్టర్స్ నెంబర్  తెలియటం మూలాన  సరాసరి అక్కడికి వెళ్లాను.
 లోపలికి తీసుకెళ్లి బాలయ్య గారు నన్ను వారి అబ్బాయికి పరిచయం చేసి ఆ క్వార్టర్స్ లో అన్నిటికంటే వెనకాతల ఉన్న ఒక చిన్న గది చూపించి "ఇందులో ఉండగలవా? " అని అడిగారు.
 "పర్వాలేదు  సార్ బావుంది .నేను ఉంటాను" అని నమస్కారం పెట్టాను.
 క్వార్టర్స్ కు సంబంధం లేకుండా  వెనకాతల చిన్నగా ఆ రూం ,దాని ఎదురుగా చిన్నగా ఇంకొక  వంటగదికూడా ఉంది.  బయటికి వెళ్లి పోవడానికి అక్కడ ఇంకొక చిన్న  తలుపు కూడా ఉంది.
 ఎవరూ వాడకుండా ఎన్నో నెలలుగా వదిలేసినందుకు ఆ రూమ్  పూర్తిగా బూజు పట్టి మట్టి తో నిండిపోయి ఉంది.   అదంతా క్లీన్ చేసుకుని, కడుక్కొని, బాగుచేసుకునేటప్పటికీ  దాదాపు రెండు గంటలు పట్టింది.  ఇంక అప్పుడు వంట చేసుకునే  సమయం, వోపిక లేక బయటకు వెళ్లి రెండు రూపాయలతో ప్లేట్ మీల్స్ తిని వచ్చాను.
 ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చదువుకుంటున్న సమయంలో శ్రీ బాలయ్య గారు నన్ను పిలిచి "అలా బయటకు రా బాబు
" అంటూ క్వార్టర్స్ ముందున్న హోటల్ కు తీసుకెళ్లారు.  టిఫిన్ తెప్పించి అది ఇద్దరం తిన్న తర్వాత చిన్నగా అన్నాడు  "బాబు నీకు ఇబ్బంది పెడుతున్నాను అని భావించవద్దు ,  ఇంకెక్కడైనా నువ్వు ఉండటానికి ఏదైనా  వేరే రూమ్ చూసుకో. నేను నా వంతుగా నెలకు వంద రూపాయలు ఆరు నెలల   వరకూ సహాయం చేయగలను.  ఇక్కడ నువ్వు ఉండటానికి మా కొడుకు ఒప్పుకోవటం లేదు"  అని బాధగా మొహం పెట్టాడు. 
 ఎన్నో ఆశలతో వచ్చిన నాకు తల గిర్రున తిరిగి పోయింది. ఒళ్లంతా చల్లబడి పోయింది. ఇది  అసలు ఊహించని పరిణామం.  అంత నమ్మకంగా నన్ను రమ్మని పిలిచిన బాలయ్య గారు ఎందుకంత నిస్సహాయంగా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు.  నిజం చెప్పాలంటే ఆ క్వార్టరు దాదాపుగా పది  గదులతో పెద్దగా ఉంటుంది. వెనకాల దూరంగా  మెయిన్ క్వార్టర్స్ కి సంబంధం లేకుండా నేను ఉంటే వాళ్ళ అబ్బాయి కి వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు.   పైగా అందులో ఎవరూ లేరు.    సరేనంటూ ఆయనకు చెప్పి  మరుసటి రోజు ఉదయాన్నే నా చిన్నప్పటి స్నేహితుడైన కర్ణాకర్ దగ్గరికి వెళ్లాను.  వాడికి నా పరిస్థితి గురించి   పూర్తిగా తెలుసు.  జరిగిందంతా విని,ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడుండాలో అసలు కిరాయి ఎంతవుతుందో ఏం చేయాలో తెలియక  బాధపడుతున్న నాకు తనవద్ద కొద్దిరోజులు ఉండటానికి రమ్మని ధైర్యం చెప్పాడు కర్ణాకర్.  నేను వెంటనే బ్రతుకు జీవుడా అనుకుని కర్ణాకర్ రూమ్ కి  నా సామాను  తీసుకుని వెళ్ళిపోయాను.  ఆ రోజే వెంటనే గుడి దగ్గరలో చుట్టుప్రక్కల  చిక్కడపల్లి  అంతట  అద్దె రూములు గురించి చూడటం మొదలు పెట్టాను. రెండో రోజు కూడా వెతికి ,ఎక్క డా దొరకక   నిరాశతో సాయంత్రం కర్ణాకర్ రూమ్ కి చేరుకున్నాను. 
 అక్కడికి వెళ్లేసరికి కరుణాకర్ నాన్న గారు  కూర్చుని ఉన్నారు.  నన్ను చూడగానే పలకరించారు. నేను రెండు చేతులతో నమస్కారం పెట్టి పక్కన చాప మీద కూర్చున్నాను.  ఆయన నన్ను అన్ని విషయాలు అడిగి కర్ణాకర్ కు కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు.    మరుసటి రోజు ఉదయం  నేను అద్దె ఇల్లు గురించి బయలుదేరుతుండగా కర్ణాకర్ నన్ను  పిలిచి
" నిన్న మా నాన్నగారు నీ గురించి అన్నీ అడిగారు. నిన్ను సాధ్యమైనంత త్వరగా రూమ్ చూసుకో మన్నారురా.   అన్యథా భావించకు." అని అనునయంగా , చిరు నవ్వుతో చెప్పాడు.
 ఎమ్మెల్యే బాలయ్య గారి అబ్బాయి నన్నెందుకు ఉండనివ్వలేదో,   మా ఊర్లో ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా పలకరించే స్నేహితుడి తండ్రి ఇప్పుడు తిరిగి  కొద్ది రోజులు  కూడా ఎందుకు ఉండ నివ్వటం లేదో  నాకు ఎంతకీ అర్థం కాలేదు.  
 ప్రపంచమనే ఈ జనారణ్యంలో బ్రతకటం ఎంత కష్టమో రెండు రోజులలో రెండుసార్లు అర్థమైంది.
అయితే' ఎంత  ఎక్కువ కష్టాలు పడితే ,అంత  ఎక్కువ విజయాన్ని సాధిస్తారు 'అని నమ్మి న వాళ్లలో  నేను ఒకడిని.
 ఆ రోజూ మధ్యాహ్నం వరకు ఎంత తిరిగినా కూడా అద్దె ఇల్లు దొరకలేదు.  కొన్ని ఉన్నప్పటికీ విద్యార్థులకు ,బ్యాచులర్స్ కు ఇవ్వలేమని తెగేసి చెప్పారు.  అలా వెతుకుతూ ఉండగా   బాలాజీ గుడి పక్క సందులో ఒక పాత ఇంటిలోకి వెళ్లాను అందులో చాలా  కుటుంబాలు అద్దెకు  ఉన్నాయి.
 ఆ ఇంటి యజమాని వయసు దాదాపు   డెబ్బది సంవత్సరాలు ఉంటాయి.  తెల్లటి పంచ పైన కండువా వేసుకొని  "  ఏవీ ఖాళీ లేవు. ఉన్నప్పటికీ మేము బ్యాచులర్స్ కి ఇవ్వము"
 అని సమాధానం చెప్పినప్పటికీ నేను ఏమీ అనకుండా అలాగే నిలబడ్డాను. అతను నన్ను తేరిపార చూసి" ఏం చేస్తావ్ బాబు నువ్వు?"  "ఇక్కడ ఉద్యోగం గురించి వచ్చానండి. లైబ్రరీ దగ్గరగా ఉంది కదా, అందుకని  ఇక్కడ వెతుకుతున్నాను " 
"మీది ఏ ఊరు?   ఏ కులం ?" అని నిర్మొహమాటంగా అడిగాడు .నేను చెప్పాను
" సరే ,అయితే ఇక్కడ ఈ వరండాలో ఉంటావా?" అని అడిగాడు.  అటువైపుగా చూశాను.  ఆయన ఇంటిముందు గుమ్మం వైపు కాస్త విశాలమైన ప్రదేశం  పైన కప్పు ముందుకు జరిగి కింద బండలు పరిచి గోడకు మూడువైపులా చెక్కతో తయారు చేసిన జాలి బిగించి ఉంది.  దాంట్లో అంతా    చెత్త సామాన్లు వేసి పెట్టారు.
" ఆ సామాను కాస్త పక్కకు జరుపుకుంటాము. ఉండగలరేమో చూడు  బాబూ, అక్కడ దూరంగా బయట ఉన్న  మా బాత్రూం నువ్వు వాడుకోవచ్చు" అని సలహా ఇచ్చాడు.  తుఫాను సముద్రంలో కొట్టుకుపోతున్న  మనిషికి చిన్న  ఆసరా దొరికినట్టుగా  నా కనిపించి వెంటనే  "సరేనండి "అని  ఇంకేమీ  ఆలోచించకుండా ఒప్పుకున్నాను.
 "75 రూపాయలు అద్దె ఇవ్వాలి .ఒకటో తారీఖు నాడు తప్పనిసరిగా ఇవ్వవలసిందే   .ఆలస్యం ఎట్టి పరిస్థితులలో చేయరాదు.   కరెంట్ బిల్లు నెలకు మూడు రూపాయలు. నల్ల నీళ్లు పొద్దున నాలుగు గంటలకి  వస్తాయి మీ అవసరానికి తగ్గట్టుగా మీరే నింపి పెట్టుకోవాలి" అని అన్ని కండిషన్స్ చెప్పాడు.  అప్పుడు ఆలోచించా బాలయ్య గారు ఇచ్చే వంద రూపాయల లో ఇంకా 20 రూపాయలు  మిగులుతాయన్నమాట అని. నేను అన్నిటికీ ఒప్పుకొని,  వరండాలో జీవనం కొనసాగించాను.  మొదట్లో కొన్ని రోజులు రోడ్డు మీద పోయే వాహనాల ధ్వని తో చుట్టూ బోలెడు దోమలతో నిద్ర పట్టేది కాదు.  ఆడవాళ్లు కాస్త ముందు వైపు బయట ఉన్న నల్ల లో నీళ్లు పట్టుకోడానికి  రోజూ పొద్దున్నే ఐదు గంటల కల్లా లేచి వరండా నుండి నడుస్తూ వెళ్లేవారు.  వారికి తగలకుండా ఉండడానికి నేను ఒక పక్కకు జరిగి జరిగి పడుకోవాల్సి వచ్చేది.  కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిపోదామని అనిపించేది.  కానీ ఇంట్లో  నా మీదే ఆశలు పెట్టుకున్న అమ్మా ,నాన్న గారు  ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు,  వారి మొహాలు గుర్తుకొచ్చేవి.    డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయిన నేను వారి కష్టాలను  గట్టెక్కిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
 ఉదయాన్నే లేచి అన్నం ఒక కూర వండుకొని,  గిన్నెలో ఉన్న అన్నాన్ని రెండు భాగాలు చేసుకుని ఒక భాగాన్ని కంచంలో వడ్డించుకొని తిని లైబ్రరీ కి బయలుదేరే   వాడిని.  నన్ను చిన్నప్పట్నుంచి పెంచిన మా నానమ్మ నాకు  ఉద్యోగం దొరికే   వరకు, తన పెన్షన్ లో 50 రూపాయలు మనీ ఆర్డర్ చేయడానికి ఒప్పుకుంది.   నెలకు కావలసిన తిండిగింజలు తెచ్చుకొని పరీక్షలు రాస్తూ, మంచి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని నమ్మకంతో ఉండే వాడిని. 
 రోజంతా చదువులో మునిగిపోయే వాడిని.కానీ రాత్రి పడుకునేటప్పుడు భవిష్యత్తు మీద భయం తో కళ్ళనిండా ఉబికి వచ్చే  కన్నీటిని ఆపటం చాలా కష్టమయ్యేది.ఇకపోతే....
మొదటి నెల గడిచిన తర్వాత బాలయ్య గారు చెప్పినట్టు మొదటి రోజు ఒకటవ తేదీన సాయంత్రానికి ఎమ్మెల్యే క్వార్టర్ కు చేరుకున్నా. లోనికి వెళ్లి నమస్కారం పెట్టాను.  ఆయన చుట్టూ చాలా మంది రైతులు కూర్చొని వున్నారు.  
"బాబూ మీరు బయట వెయిట్ చేయండి " అని  బాలయ్య గారు నాకు సైగ చేశారు. 
నేను అలాగే ఆలోచిస్తూ బయట రాత్రి 11 గంటల వరకు మెట్ల మీద కూర్చుండి పోయాను.
దాదాపు 11.30 గంటలకు అందరూ వెళ్ళి పోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి నన్ను పలకరించి తన లాల్చి లో నుండీ వంద రూపాయల నోటు తీసి ఇచ్చి " మరి ఇప్పుడు ఏమి చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. 
"  ఇంకా బ్యాంక్ పరీక్షలు రాయడానికి చదువుతున్నాను సర్ " అన్నాను చేతులు కట్టుకుని. 
"సరే . జాగ్రత్త బాబూ " అని నా భుజం తట్టి వెను తిరిగి వెళ్లిపోయారు.  నేను రెండు చేతులతో నమస్కారం పెట్టి నా రూమ్ అనబడే వరండా కు నడుస్తు 3 కిలోమీటర్ లు వచ్చి, తిని పడుకునే సరికి రాత్రి ఒకటి దాటింది. మర్చి పోలేని మరో ముఖ్యమైనవిషయం ఏమిటంటే
అప్పుడప్పుడు ఇంటి యజమాని కూతురు డా. రోహిణి, హోమియోపతి ప్రొఫెసర్, నాకు కొన్ని కూరలు రాత్రి పూట ఇచ్చేవారు.  నాకు ఆ రోజు పండుగ అన్న మాట!. ఇంటి యజమాని నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు ధైర్యం 
 చెబుతుండేవారు.  కానీ రెంటుకు మాత్రం ఒక్క రోజు కూడా ఆగే వాడు కాదు.  అప్పుడప్పుడూ ఏదైనా డబ్బులు అవసరం పడితే ఇచ్చేవాడు. 
 రెండు పొడవాటి బెంచీలు ఇంట్లోంచి తెచ్చి ఇచ్చి వాటిని ఒక దగ్గరగా వేసి మంచం లాగా  వాడుకోమని ఇచ్చాడు,మహానుభావుడు.
 ఒక రోజు నేను లైబ్రరీ నుంచి వచ్చేసరికి "బాబు నీకు  ఉత్తరం వచ్చింది చూడు" అంటూఒక కవరు నా చేతిలో పెట్టాడు. అది మా అమ్మ రాసిన ఉత్తరం.
 విప్పి చదివితే,  దాన్నిండా అక్కడి కష్టాలే ఉన్నాయి.  ఒకసారి వెళ్లి ధైర్యం చెప్పి రావాలని నిశ్చయించుకున్నాను. 
 మరుసటి రోజు పాసింజర్ ట్రైన్ ఎక్కి ఇంటికి చేరుకున్నాను. 
 ఆరోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మా అమ్మ నా దగ్గరకు వచ్చి కూర్చుని
"  ఆ బ్యాంకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో ఏమోరా,    ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు  వెంటనే వచ్చేస్తాయి కదా ఇక్కడ,  వాటికి వెళ్ళిపోవచ్చు కదరా " అంది  దీనంగా.
 "ఇంత బాగా చదివి నేను ఆఖరికి బతకలేక బడిపంతులు కావాలన్నమాట,  భలే చెప్పావు అమ్మ.  ఇన్ని రోజులు భరించాను. ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దాం,  మంచి ఉద్యోగం వస్తుంది.  ఈ సమయంలో నువ్వు అధైర్య పడి నన్ను  నిరుత్సాహపరచే కే"  అంటూ సముదాయించి,   స్నేహితుడు ఓం ప్రకాష్ దగ్గరికి బయలుదేరాను.
 నన్ను చూడగానే చాలా సంతోషం తో ప్రేమతో దగ్గర తీసుకొని కూర్చోబెట్టి యోగక్షేమాలు అన్నీ కనుక్కున్నాడు ఓం ప్రకాష్.  అన్ని విషయాలు మాట్లాడుకున్న తరువాత తనను కూడా హైదరాబాద్ వచ్చి  ఉద్యోగ ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాను. 
" ఇప్పుడు నాతో వచ్చేయి రా.  నాతో ఉండడానికి నీకేం అభ్యంతరం.?"  అంటూ తనకు నచ్చచెప్పడం మొదలుపెట్టాను.  ఒక పట్టాన ఒప్పుకోలేదు.   ఇక లాభం లేదనుకొని,  వాడి అమ్మా నాన్నకు ఈ విషయం చెప్పి నాతో  ఉండి తను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే  హైదరాబాదులో మంచి అవకాశాలు వస్తాయని  వారికి అర్థమయ్యేలా చెప్పాను.  ఒక గంట ఆ విధంగా మాట్లాడిన తర్వాత మొత్తానికి నా బాధ భరించలేక నా ఒత్తిడి కి మరుసటి రోజు నాతో రావడానికి ఓంప్రకాష్  ఒప్పుకొన్నాడు.
  తను హైదరాబాద్ వచ్చి నాతో ఉంటున్నప్పటినుంచి  నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. ఒంటరితనం పోయింది.  వాడి  పెట్టి నిండా  రకరకాల చిరుతిండ్లు పెట్టి పంపించింది వాళ్ళ అమ్మగారు.  ఇంట్లో పెద్ద కొడుకు అవడం వలన చాలా సుఖంగా పెరిగాడు.  నేను అది గమనించి వంట దాదాపుగా నేనే చేసేవాడిని.  ఆకలికి అసలు  ఆగలేకపోయేవాడు. వంట  చేస్తున్నంతసేపు స్టవ్ పక్కనే పడుకునేవాడు.  అయిపోయిన వెంటనే  కంచం పెట్టుకొని అది తినేస్తే కానీ వాడికి మనశ్శాంతి ఉండేది కాదు.    అది చూసి నేను నవ్వి నవ్వి  చచ్చేవాడిని. 
 ఇంటి యజమాని ని నేను   మర్యాదపూర్వకంగా పెదనాన్న అని సంబోధించే వాడిని.  అది చూసి నన్ను తెగ తిట్టేవాడు. 
 "ఒరేయ్ !నీ మస్కా పాలిషింగ్ వదిలేయ్ రా,సార్ అని పిలు,  లేదా ఏమండీ ! అని పిలువు.  అంతేకానీ నీకు పెదనాన్న ,పెదనాన్న  ఏంటది"  అని  తిట్టి  మందలించే వాడు.  వాడి కోపం చూసి నేను మనసారా నవ్వుకునే వాడిని.  వాడికి అసలు లౌక్యం అనేది తెలియకుండా ఉండేది.  చాలా ముక్కుసూటిగా వ్యవహరించేవాడు.
 ప్రతి నెల నేను  మొదటి  రోజు బాలయ్య గారి దగ్గరికి వెళ్లేవాడిని.  విచిత్రం  ఏమిటంటే ఆయన ఎవరి ముందు కూడా నాకు డబ్బులు ఇచ్చేవారు కాదు.  అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నా బాగోగులు కనుక్కొని వంద రూపాయలు ఇచ్చి వెళ్ళి పోయేవారు.
దాదాపు మూడు  నెలలు గడిచిన మీదట  మూడు బ్యాంక్ ఉద్యోగ పరీక్షల లో ఒక ఇన్సూరెన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత లభించి ఇంటర్వ్యూలకు వెళ్లాను.   మొట్టమొదటిగా  న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం లభించింది.  ఎందుకో ఏమో కానీ చాలా కష్టాలు అనుభవించిన నిజాంబాద్ ప్రాంతంలో నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకుండా ఉండింది.  అందుకని మొదట  హనుమకొండ రెండవది హైదరాబాద్ మూడవ ఛాయిస్ నిజామాబాద్ అడిగాను.  అన్నీ మనం కోరుకున్నవి జరగవు కదా అన్నట్లుగా నాకు నిజాంబాద్ పోస్టింగ్ ఇచ్చారు.  
 ఇంకా విచిత్రం ఏమిటంటే ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ మిస్టర్ రామచంద్ర రావు గారు నా అపాయింట్మెంట్ లెటర్ వ్యక్తిగతంగా నా చేతికి ఇచ్చారు  .  అది తీసుకొని చిక్కడపల్లి లో ఉన్న వరండా ఖాళీ చేసి నేను ఓం ప్రకాష్ ఇద్దరం నిజాంబాద్ కు ప్రయాణమయ్యాము.  ఇంకొక గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఓం ప్రకాష్ కు డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగం వచ్చింది. 
 నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఇంట్లో మరెవ్వరు ఒక్క రోజు కూడా పస్తులు ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. 
 నాకు వివాహం జరిగిన తర్వాత ఒకరోజు కామారెడ్డి కి వెళ్లి  ఎక్స్ ఎమ్మెల్యే బెస్త బాలయ్య  గారిని  కలిసాను.
 రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ,వారి అమ్మగారి పండ్ల దుకాణంలో కూర్చుని ఉన్నారు.  రోడ్డుకి అవతల నిలబడి ఆయనను చూశాను.  ఎటువంటి అవినీతి చేయకుండా ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్ళు నిజాయితీగా బ్రతికి అతి సాధారణ వ్యక్తి లాగా అక్కడ కూర్చుని ఉన్న ఆయనను చూసి నాకు  దుఃఖం ఆగలేదు.  గమనించి చూస్తే తెలుస్తోంది వేసుకున్న బట్టలు కూడా చాలా పాత పడిపోయాయి.  నేను ఆయన ముందుకు వెళ్ళి నిలబడి  ఆయన కాళ్ళకు  నమస్కరించాను.
 ఆయన ఆశ్చర్యపోయి లేచి నిలబడి" ఎవరు బాబు మీరు?"  అని నన్ను గుర్తు పట్ట  లేక అడిగారు. 
 నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత కూడా ఆయనకు నేను గాని నాకు అతను చేసిన సహాయం కానీ గుర్తుకు రాలేదు.  మా నాన్నగారి అమ్మగారి పేరు చెప్పిన తర్వాత ఆయన గుర్తు పట్టటం జరిగింది.  నాకు చేసిన డబ్బు సహాయం మాత్రం ఆయనకు గుర్తుకు లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. 
 పక్కనున్న చిన్న టీ కొట్టు కు తీసుకొని వెళ్లి కూర్చోబెట్టి, క్షేమ సమాచారాలు కనుక్కొని , టీ  త్రాగించి నాకు వీడ్కోలు చెప్పి లేచాడు. 
 అప్పుడే బ్యాంకులో నుంచి నేను తీసుకున్న వెయ్యి రూపాయల  ను ( పది రూపాయల నోట్లు)జేబులోంచి తీసి తన చేతిలో బలవంతంగా పెట్టి  ఆయన రెండు చేతుల మీద నా నుదురు పెట్టి    నమస్కరించి , చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి వెనుతిరిగాను.  నా జీవితంలో వీళ్లే నా భగవంతుడి స్వరూపాలు.  అతని గొప్పతనాన్ని గురించి సాధారణ జీవితం గురించి  నీతి నిజాయితీ గురించి 2014లో టీవీ v 6 లో కూడా వచ్చింది.  2019లో ఆ.మహామనీషి భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు.  ఆయన చేసిన  సహాయాన్ని  తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నా కళ్ళు  చెమ్మగిల్లుతాయి.  దేవుడు నాకు కష్టాలు పెట్టినప్పటికీ  తాను మనుషుల రూపంలో   దేవతలను నా దగ్గరకు పంపి నాకు మనుషుల మీద వారిమనసుల మీద దేవుడి మీద, మంచితనం  మీద ఇంకా ఎక్కువ నమ్మకం కలిగేలా చేశాడు. 
అంతా దేవుడి దయమరి!.
                         ***
ఫోటోలో.....ఎమ్. ఎల్. ఏ...బాలయ్య గారుమిత్రుడు.....ఓం ప్రకాశ్ నేను(శ్యామ్ కుమార్)




కామెంట్‌లు
లతా. V narsimhan. LIC hyd చెప్పారు…
I thought it was a story, but jeevita satyalu. 👌👌👌🙏🙏Devudu ekkado Kadu chala Mandi manushullone untaru 🙏🙏
Namilikonda విశ్వేశ్వర శర్మ. హన్మకొండ చెప్పారు…
కళ్ళకు కట్టినట్లుగా వ్రాసారు. భగవంతుడు మంచివాళ్లకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గిన వారి జీవితం అద్భుతంగా మలుస్తాడు. అదే కర్మ సిద్ధాంతం. కష్టాలను దీటుగా ఎదుర్కొన్న మీకు భగవంతుని అండ సదా ఉంటుంది. అందుకే 'సర్వం శ్రీ కృష్ణానుగ్రహం' అని నేను ప్రతిసారి అంటాను. కష్టాలకు ఎదురీదిన మీకు జీవితంలో సదా విజయం కలుగుతుంది. శ్రీ కృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు.
దామోదర శివ రాత్రి. హైదరాబాద్ చెప్పారు…
Excellent.You are role model to present unemployed youth.
Good luck to Shyam and Omprakash
కొలను వెంకటేశ్వర్ రెడ్డి. జైలు శాఖ. హైదరాబాద్ చెప్పారు…
భేషజాలు లేకుండా, నిష్కల్మషముగా, నిర్భయముగా, జరిగినది కండ్లకు కట్టినట్టుగా, వివరంగా, హృద్యంగా మమ్మల్ని కూడా, మీతోపాటు మా నిరుద్యోగ పోరాటాన్ని మాకు ఙ్ఞప్తికి వచ్చేటట్టు, మీరు వివరించిన తీరు, అమోఘం 🙏👌💐
నరేష్. ప్రొఫెసర్. Osmania. హైదరాబాద్ చెప్పారు…
ముందుగా మనోపూర్వక అభినందనలు.💐💐
గతాన్ని, మూలాల్ని మర్చిపోనివాడు మహామనిషి. బతుకు పోరాటం లో సాగించిన అలుపెరుగని ఆరాటం వర్ణించిన శైలి అపూర్వం. చాలా హ్రుద్యంగా రాశావు శ్యామ్.
Dr.kokkonda సుధాకర్ చెప్పారు…
I have no words to say anything about the agony you experienced
God is great. 👍💐🙏
మహా జన dhanpal omprakash. ఓరియంటల్ ఇన్సూరెన్స్. ఆదిలాబాద్ చెప్పారు…
Hi, Maam, my sahi hu, duplicate national bana abhi thak, thankyou for your compliments, but surprise thing is how n where my this pic.got by our beloved Shyam, Great Shyam 🙏🙏🙏
Jadala రాధిక. ముషీరాబాద్ చెప్పారు…
Annaya vamooo enni kashtalu paddaru
Me story chadhuvuthuntei edupu vachindhi
Dr k సుధాకర్ చెప్పారు…
I have gone through your early days of your employment
No words to say about the agony you experienced.
God is great. 👍💐🙏
Dv చారి. న్యూ ఇండియా insurance. చెప్పారు…
చాలా బాగా రాశావు శ్యామ్. అభినందనలు.
నాకు ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. పోల్చి చూసుకొన్నాను.... గుడ్. 👏👏👏
M.D. omprakash. Laxmi lodge. Adilabad చెప్పారు…
: You can go- head, your all stories are good and interesting, why because they all are actuals and they are not imaginations.👌👌👌
not cooked.As early as possible all stories must be published. Wish you all the best and GOD bless you.🙏🙏🙏
NV sharma చెప్పారు…
కళ్ళకు కట్టినట్లుగా వ్రాసారు. భగవంతుడు మంచివాళ్లకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గిన వారి జీవితం అద్భుతంగా మలుస్తాడు. అదే కర్మ సిద్ధాంతం. కష్టాలను దీటుగా ఎదుర్కొన్న మీకు భగవంతుని అండ సదా ఉంటుంది. అందుకే 'సర్వం శ్రీ కృష్ణానుగ్రహం' అని నేను ప్రతిసారి అంటాను. కష్టాలకు ఎదురీదిన మీకు జీవితంలో సదా విజయం కలుగుతుంది. శ్రీ కృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆలస్యంగా స్పందిస్తున్నాను.
Kusha kumar హైదరాబాద్ చెప్పారు…
Hi sir....meeru chaana great...mimalni chusi chaana nerchukovaali....mee pattudala entho mandiki adarsham avuthundi sir...🙏
Vijaykumar. Csi college. నిజామాబాద్ చెప్పారు…
నా బాధలు చెప్పుకుంటే దాసరి నారాయణరావు లాంటి దర్శకులు కనీసం 50 సినిమాలు తీయగలరు.

ఖలీల్ జీబ్రాన్ తత్త్వవేత్త ఏమన్నాడంటే
"నీ బాధల భాండాగారాన్ని అర్పించుకోవడంలో తప్పు లేదు కానీ సహృదయుడైతే హత్తుకుంటాడు, అల్పుడైతే పొడినవ్వు నవ్వుతాడు" ✋🙏😷
Sujatha thangudu.mumbai చెప్పారు…
Hi gd mg
I read this story
Really I appreciate ur dedication about ur life
Ur positive thinking
Sooo many people gd in this world
This kind of people inspiration of people
I am not writer like u
మురళీ दर రెడ్డి. New India asurance.hyd చెప్పారు…
Great Narration Shyam. Heart touching background. Your determination is laudable. 👏👏👏👌👌👌💐💐
Common man చెప్పారు…
Excellent winning experience and good motivation for career aspirants.
Sudeep nalini. చెప్పారు…
Excellent winning experience and good motivation for career aspirants.
Chandra shekar reddy.singareni చెప్పారు…
మనుష్షుల్లో దేవుడు చాలా బాగుంది, నీ స్వీయానుభవ కథనం. నేడు అలాంటి రాజకీయ నాయకులను ఊహించలేము. కుటుంబం కోసం నీవు పడిన కష్టాలు ఇతరులకు స్పూర్తిదాయకం. రచనా నైపుణ్యం కథకు కథకు పెరుగుతుంది మిత్రమా! అభినందనలు.
రాజేందర్ రెడ్డి. Gm singereni చెప్పారు…
Shyam
Your story writing ability is appreciable
Conditions of middle & lower middle class were horrible
Your greatness lies in telling the truth without hesitation
It requires courage & conviction
It’s a heart touching narration
Keep going your writing
God bless you
Rajender Reddy
K bharath. Hyd చెప్పారు…
Really ur a great person sir....mimalni aadarshanga theesukoni munduku velluchu enni bhadalunna...Thanq so much sir
రామ చార్యుడు బంగారు చెప్పారు…
దేవుడు కొందరిలో కనిపిస్తారు. గర్భగుడిలో వెలిగే దివ్వెలు వాళ్ళు.వారి ఋణం తీర్చుకున్న మీ జన్మ నిజంగా ధన్యత పొందింది.ఇవ్వాలి, తరువాతనే తీసుకోవాలని మంచి సందేశము మిగిలిచినారు.
Gonuguntla prabhaker rao. హన్మకొండ చెప్పారు…
Shyam Kumar ఇక్కడ మీ మహోన్నతమైన సున్నిత మైన మీ మనస్సు కు
ఒకనాటి రాజకీయ విలువలకు అద్దం పడుతుంది మీ కథ.
మనం నడిచి వచ్చిన వాస్తవాలకు అక్షర రూపం మీ కథలు. మనం రచయితలు కాము, అయినా మీ మనసులోని భావాలకు మీరు ఇచ్చే అక్షర రూపం, ప్రతి మనిషి కి ఎక్కడో ఒకచోట గుండే కు హత్తుకొని వారి బాల్యం లోకి తీసుకువెళ్ళి, ఆ స్మృతి ని మధుర స్మృతి గా మిగిలిస్తుంది అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.... అమోఘం... అనిర్వచీయమైన కథలు మీవి అంతే
Rakesh. Bloomflex చెప్పారు…
Nothing to say Opinion
sir..chadivina vi anni chaal bagunnai sir.. really superb sir..
అజ్ఞాత చెప్పారు…
I read the narrative with regard ur struggle after graduation.without proper facilities the struggle u have made is really heart rendering.But the way you were focused with all your problems around u is great thing to come out successfully.You have paid sincere and great tributes to people who have helped you.God bless you.



A.Chandra shekar.
ఆకుల చంద్ర శేఖర్ professor. Retd చెప్పారు…
I read the narrative with regard ur struggle after graduation.without proper facilities the struggle u have made is really heart rendering.But the way you were focused with all your problems around u is great thing to come out successfully.You have paid sincere and great tributes to people who have helped you.God bless you.



A.Chandra shekar.
Giribabu.APSFC.NZBD చెప్పారు…
"A Lamp doesn't speak. It introduces itself through its Light. Achievers never expose themselves. But their Achievements expose them."
Very good morning
వడ్డీ upender rao. Canara bank.hyd చెప్పారు…
The times we grew through from childhood were like that. Many were poor and couldn't afford higher education of their children.
Only rich and meritorious from among poor who got encouragement from some source could continue after school education.
From my school, among SSLC batch, I was only the person joined PUC that is college purely because of my merit in academics, and my father took the burden even being just a car driver with a family of 8 members and salary of Rs.60/-. All my relatives were also poor and less educated.
That period luckily India progressed. Lot of jobs in public sector opened. But, competition was there as unemployment was also of big size. I got job in bank as preferred to the best of understanding, as no body was there to guide or advise us.
That's way my life settled and my father and family could get much needed financial support.
Similar with a little difference is the story of many people of our age then.
But, what is the use of remembering the agony?
Our age is also advanced and time has to come for planning the closing scene, with an eye on paramatma.
God blessed us and also will bless us.
🍪🍪🍪🍪🍪🍪🍪
Venkata Ramana Rao చెప్పారు…
శ్యామ్ కుమార్ గారు, మీ అనుభవం చదివాక , కష్టాలు, పట్టుదల, సహనం, మనో ధైర్యం, ఏకాగ్రత ఈ మాటలకి సాక్షీభూతం మీ వ్యక్తిత్వం. తల్లితండ్రులు ఇచ్చిన సౌకర్యాలతో, కష్టమంటే తెలియకుండా చదువుకుని , ఉద్యోగం లో స్థిరపడిన మాలాంటి వాళ్లకు ఇలాంటివి ఊహించలేము. చేసిన మేలు ఎప్పటికీ మరువకూడదు అన్న మాటకి అర్థం చూపించారు.రచనా శైలి చాలా బాగుంది. కళ్లకు కట్టినట్టుగా మీ జీవితాన్ని అక్షరాలలో చూపించారు. హృదయాన్ని స్పందింప చేశారు.అందరిలో ఒక స్ఫూర్తి నింపారు.
మీకు సవినయ ధన్యవాదాలు

,
వైకుంఠం. Khammam చెప్పారు…
అబ్బా ఎంత బాగా వ్రాశారు kalpitama ఎదర్ధ సంఘటనా కానీ ఎలాంటివి నిస్వార్థంగా నిచలంగ ఉండేవాళ్లు మనకు తెలవకుందనే కొందరు manapravrthanani గమనించి మనకు మంచి వేయాలనే ఉద్దేశంగా deude papistarani అనుకోవాలి వల్లే అసలైన కనబడే deullu చాలా బావుంది💯👌🌹🙏🙏🙏🌹
Unknown చెప్పారు…
Chala baga rasaru sir..kallaku kattinattugaa undi..